బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ పై ఫిక్సింగ్ ఆరోపణలు.. మరో 8 మందిపై కూడా!

  • Author Soma Sekhar Published - 08:16 AM, Wed - 20 September 23
  • Author Soma Sekhar Published - 08:16 AM, Wed - 20 September 23
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ పై ఫిక్సింగ్ ఆరోపణలు.. మరో 8 మందిపై కూడా!

ప్రపంచ క్రికెట్ ను ఫిక్సింగ్ అనే భూతం కబళిస్తూనే ఉంది. టోర్నీ ఏదైనా, అది ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఈ భూతం పేరు వినిపిస్తూనే ఉంది. తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ లో ఫిక్సింగ్ కలకలం రేపింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు అయిన నాసిర్ హుస్సేన్ ఫిక్సింగ్ కు పాల్పడ్డట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అవినీతి వ్యతిరేక విభాగం అభియోగాలు నమోదు చేసింది. అతడితో పాటుగా మరో 8 మందిపై కూడా అభియోగాలు ఫైల్ చేసింది. 2020-21 సీజన్ అబుదాబి టీ10 లీగ్ లో వీరు ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో ఫిక్సింగ్ కలకలం సృష్టంచింది. 2020-21 సీజన్ అబుదాబి టీ10 లీగ్ లో ఫిక్సింగ్ కు పాల్పడినట్లు బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ అయిన నాసిర్ హుస్సేన్ తో సహా ఎనిమిది మందిపై ఐసీసీ అవినీతి వ్యతిరేక విభాగం అభియోగాలను నమోదు చేసింది. ఈ ఎనిమిది మంది పూణే డెవిల్స్ జట్టుతో సంబంధం ఉన్నవారు కావడం గమనార్హం. వీరిలో ముగ్గురు భారతీయులు ఉండటం శోచనీయం. కాగా.. మిగతావారు విదేశీయులు. పూణే డెవిల్స్ టీమ్ సహయజమానులైన కృషన్ కుమార్ చౌదరి,పరాగ్ సంఘ్వీ, అసిస్టెంట్ కోచ్ సన్నీ థిల్లాన్ ఇండియన్స్. అప్పటి టీ10 లీగ్ లో 6 మ్యాచ్ లు ఆడిన డెవిల్స్ జట్టు ఒక్క మ్యాచే గెలిచింది. ప్రస్తుతం ఈ ఫిక్సింగ్ కేసుపై విచారణ జరుగుతోంది. కాగా.. నాసిర్ హుస్సేన్ బంగ్లా తరపున 65 వన్డేలు, 19 టెస్టులు, 31 టీ20లు ఆడాడు. మరి ఈ ఫిక్సింగ్ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments