iDreamPost
android-app
ios-app

Rohit Sharma: రోహిత్ క్రేజీ ఫీట్.. కోహ్లీ, గిల్​ను దాటేసి నంబర్ 2 బ్యాటర్​గా..!

  • Published Aug 14, 2024 | 3:27 PM Updated Updated Aug 14, 2024 | 3:27 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రేజీ ఫీట్ నమోదు చేశాడు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ శుబ్​మన్ గిల్​ను అతడు దాటేశాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రేజీ ఫీట్ నమోదు చేశాడు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ శుబ్​మన్ గిల్​ను అతడు దాటేశాడు.

  • Published Aug 14, 2024 | 3:27 PMUpdated Aug 14, 2024 | 3:27 PM
Rohit Sharma: రోహిత్ క్రేజీ ఫీట్.. కోహ్లీ, గిల్​ను దాటేసి నంబర్ 2 బ్యాటర్​గా..!

టీమిండియాకు ప్రస్తుతం మ్యాచ్​లు లేకపోవడంతో జట్టు ఆటగాళ్లంతా రెస్ట్ తీసుకుంటున్నారు. కొందరు ప్లేయర్లు వెకేషన్స్ అంటూ ఫ్యామిలీతో కలసి ఫారెన్ ట్రిప్స్​తో బిజీగా ఉన్నారు. మరికొందరు ఆటగాళ్లు ఇళ్ల వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఖాళీ సమయాన్ని కూడా వినియోగించుకుంటున్నాడు. ఫిట్​నెస్​, బ్యాటింగ్ టెక్నిక్​ను మెరుగుపర్చుకోవడంపై ఫోకస్ చేస్తున్నాడు. అతడు ట్రెయినింగ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హిట్​మ్యాన్​ కమిట్​మెంట్, డెడికేషన్ చూసిన అభిమానులు గ్రేట్ బాస్ అంటూ మెచ్చుకుంటున్నారు. అలాంటి హిట్​మ్యాన్ ఫ్యాన్స్​కు ఓ గుడ్​న్యూస్. ఇది వింటే అభిమానులు కాలర్ ఎగరేస్తారు.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా వన్డే ర్యాంకింగ్స్​ను ప్రకటించింది. ఇందులో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (824 పాయింట్లు) నంబర్ వన్ ర్యాంక్​లో కొనసాగుతున్నాడు. భారత సారథి రోహిత్ శర్మ (765 పాయింట్లు) రెండో ర్యాంక్​లోకి దూసుకొచ్చాడు. శుబ్​మన్ గిల్ (763)ను వెనక్కినెట్టి సెకండ్ పొజిషన్​కు చేరుకున్నాడు హిట్​మ్యాన్. ఈ లిస్ట్​లో టాప్ బ్యాటర్ కోహ్లీ (746) నాలుగో స్థానంలో కంటిన్యూ అవుతున్నాడు. వన్డే ర్యాంకింగ్స్​లో టాప్-10లో ముగ్గురు భారత బ్యాటర్లే ఉండటం విశేషం. మొదటి స్థానంలో ఉన్న బాబర్​ను అధిగమిస్తే రోహిత్ టాప్​కు చేరుకుంటాడు. అయితే ఇప్పట్లో వన్డే సిరీస్​లు లేకపోవడంతో దీనికి చాలా టైమ్ పట్టేలా ఉంది.

Rohith Sharma

శ్రీలంక సిరీస్​లో కోహ్లీ, గిల్ అంతగా రాణించలేదు. కానీ రోహిత్ మాత్రం అదరొట్టాడు. మూడు వన్డేల్లో కలిపి 157 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దీంతో అతడు గిల్​ను దాటేసి ర్యాంకింగ్స్​లో రెండో స్థానానికి చేరాడు. కెరీర్​లో ఇది అతడికి జాయింట్ బెస్ట్ ర్యాంక్ కావడం గమనార్హం. ఇక, బౌలింగ్ ర్యాంకింగ్స్​లో టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. కుల్దీప్​తో పాటు పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా (8వ స్థానం), మహ్మద్ సిరాజ్ (సంయుక్తంగా 9వ స్థానం) కూడా టాప్-10 బౌలర్ల లిస్ట్​లో ఉండటం విశేషం. మరి.. కోహ్లీ, గిల్​ను దాటేసి రోహిత్ నంబర్ 2 ర్యాంక్ బ్యాటర్​గా ఆవిర్భవించడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.