iDreamPost
android-app
ios-app

Ravichandran Ashwin: భయపడుతూ కూర్చోవడం నా వల్ల కాదు.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Aug 13, 2024 | 6:43 PM Updated Updated Aug 13, 2024 | 6:43 PM

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా ఉంటాడు. తన అభిప్రాయాలను కూడా నిక్కచ్చిగా చెప్పేస్తాడు. అలాంటోడు తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా ఉంటాడు. తన అభిప్రాయాలను కూడా నిక్కచ్చిగా చెప్పేస్తాడు. అలాంటోడు తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

  • Published Aug 13, 2024 | 6:43 PMUpdated Aug 13, 2024 | 6:43 PM
Ravichandran Ashwin: భయపడుతూ కూర్చోవడం నా వల్ల కాదు.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా ఉంటాడు. తన అభిప్రాయాలను కూడా నిక్కచ్చిగా చెప్పేస్తాడు. ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆర్టీఎం రూల్ వల్ల ఫ్రాంచైజీలకు మంచి జరుగుతోందని, కానీ ప్లేయర్లకు మాత్రం అన్యాయం జరుగుతోందని స్పష్టం చేశాడు. ఆర్టీఎం, రిటెన్షన్ ప్రాసెస్, రిటెయిన్ చేసుకునే ఆటగాళ్ల లిమిట్​ వంటి అంశాలపై అతడు రియాక్ట్ అయ్యాడు. అలాంటోడు తాజాగా తన వ్యక్తిత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లలా తాను భయపడుతూ కూర్చునే రకం కాదన్నాడు. అది తన వల్ల కాదన్నాడు అశ్విన్.

‘నాకు ఇన్​సెక్యూరిటీ లేదు. ప్రతి విషయానికి భయపడుతూ అభద్రతా భావానికి లోనయ్యే వ్యక్తిని కాదు. ఎప్పుడూ సేఫ్​గా ఉండటం, గిరి గీసుకొని అందులోనే బతకడం నాకు చేతగాదు. ఏ కష్టాలు వద్దనుకొని హాయిగా ఉండాలనుకునే రకం కాదు. సేఫ్​గా ఉండటం కంటే జీవితంలో ఫెయిల్ అవ్వడం బెటర్ అని నేను అనుకుంటా. అది నా క్యారెక్టర్. ఇన్​సెక్యూరిటీస్​తో బతికే వాళ్లు ఉంటారు. అలా నేను ఉండలేను. నాకు ఎలాంటి అభద్రతా భావం లేదు’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. సాధారణంగా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పే అశ్విన్ కాంట్రవర్సీలకు తావివ్వకుండా చూసుకుంటాడు. అలాంటోడు తాజాగా ఈ కామెంట్స్ చేయడంతో ఎవర్ని ఉద్దేశించి ఇలా మాట్లాడి ఉంటాడా అని అభిమానులు ఆలోచనల్లో పడ్డారు.

ఇక, వన్డేలు, టీ20లకు దూరంగా ఉంటున్న అశ్విన్ టెస్టుల్లో ఆడుతున్నాడు. ఇప్పుడు నేషనల్ డ్యూటీ లేకపోవడంతో ఫిట్​నెస్​ మీద కాన్​సంట్రేషన్ చేస్తున్నాడు. రాబోయే ఐదారు నెలల్లో భారీగా టెస్టు మ్యాచులు ఆడాల్సి ఉంది. అందుకే ఫిట్​గా ఉండటంతో పాటు బౌలింగ్ వేరియేషన్స్​ను మెరుగుపర్చుకోవడంపై వర్క్ చేస్తున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్​లు లేనప్పుడు డొమెస్టిక్ క్రికెట్​లోనూ పాల్గొంటున్నాడు అశ్విన్. ఇటీవల తమిళనాడు ప్రీమియర్ లీగ్​లోనూ పార్టిసిపేట్ చేశాడు. ఆ టోర్నమెంట్​లో బౌలర్​గానే గాక బ్యాటర్​గానూ అదరగొట్టాడు. అతడి టీమ్ దుండిగల్ డ్రాగన్స్ టైటిల్ ఎగరేసుకుపోవడంలో ఆటగాడిగా, సారథిగా అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. అలాంటి ఈ లెజెండ్​ను వచ్చే నెలలో జరిగే బంగ్లాదేశ్​ సిరీస్​తో మళ్లీ గ్రౌండ్​లో చూడొచ్చు. మరి.. తనకు అభద్రతా భావం లేదంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetkazan girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş