Yuvaraj Singh: ICC నుంచి యువరాజ్ సింగ్ కి అరుదైన గౌరవం! దేశం నుండి ఒకేఒక్కడు!

ఐసీసీ నుంచి టీమిండియా మాజీ ప్లేయర్, 2011 వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ కు అరుదైన గౌరవం దక్కింది. దేశం నుంచి ఈ గౌరవం దక్కించుకున్న ఒకే ఒక్కడిగా యువీ నిలిచాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐసీసీ నుంచి టీమిండియా మాజీ ప్లేయర్, 2011 వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ కు అరుదైన గౌరవం దక్కింది. దేశం నుంచి ఈ గౌరవం దక్కించుకున్న ఒకే ఒక్కడిగా యువీ నిలిచాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

యువరాజ్ సింగ్.. సిక్సర్ల కింగ్ గా వరల్డ్ క్రికెట్ పై తనదైన ముద్రవేశాడు. ఇక టీమిండియా చిరకాల స్వప్నం అయిన వన్డే వరల్డ్ కప్ ను దేశానికి అందించాడు. 2011 వరల్డ్ కప్ లో క్యాన్సర్ పై పోరాడుతూనే, ప్రత్యర్థుల భరతం పట్టాడు యువీ. భారతీయుల కలను సాకారం చేసి.. ఓ యోధుడిగా క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. అలాంటి స్టార్ ప్లేయర్ కు ICC నుంచి అరుదైన గౌరవం దక్కింది. భారతదేశం నుంచి ఈ గౌరవం దక్కిన ఒకే ఒక్కడిగా యువరాజ్ నిలిచాడ. ఇది మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనికి కూడా దక్కలేదు. మరి ఆ అరుదైన గౌరవం ఏంటంటే?

టీమిండియా మాజీ ప్లేయర్, స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు ICC నుంచి అరుదైన గౌరవం దక్కింది. యువీని టీ20 వరల్డ్ కప్ 2024కు బ్రాండ్ అంబాసిడర్ గా ఐసీసీ ఎంపిక చేసింది. 2007 టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ పై 6 బంతుల్లో 6 సిక్సులు బాదిన సందర్భానికి గుర్తుగా అతడిని ఈ మెగాటోర్నీకి అంబాసిడర్ గా నియమించింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా తన సోషల్ మీడియాలో ప్రకటించింది. ప్రస్తుతం టీమిండియా నుంచి ఈ అవకాశం దక్కించుకున్న ఒకే ఒక్కడిగా యువీ నిలిచాడు. భారత్ కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహేంద్రసింగ్ ధోనికి కూడా ఈ అవకాశం దక్కకపోవడం గమనార్హం. కాగా.. యువీ అంబాసిడర్ హోదాలో ప్రపంచ కప్ టోర్నీకి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొంటాడు.

ఇక బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై యువరాజ్ స్పందించాడు..”టీ20 వరల్డ్ కప్ ద్వారానే నాకు క్రికెట్ లో కొన్ని అనుభూతులు ఉన్నాయి. ఒకే ఓవర్లో 6 సిక్సులు బాదడం నా కెరీర్ లో స్పెషల్. ఈ మెగాటోర్నీలో భాగం కాబోతున్నందుకు ఆనందంగా ఉంది” అని చెప్పుకొచ్చాడు యువీ. అయితే యువరాజ్ సింగ్ తో పాటుగా వెస్టిండీస్ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్, ఒలింపిక్ మెడల్ విన్నర్ ఉస్సెన్ బోల్ట్ లను కూడా అంబాసిడర్ లుగా ఐసీసీ నియమించింది. ఈ ముగ్గురు టీ20 వరల్డ్ కప్ కు అంబాసిడర్ లుగా వ్యవహరించనున్నారు. మరి యువరాజ్ సింగ్ కు దక్కిన ఈ గౌరవంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments