వరల్డ్‌ కప్‌ కోసం ICC కొత్త రూల్స్‌! ఇలా అయితే కష్టమే

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్‌ కప్‌ మహా సంగ్రామం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 5 నుంచి అహ్మాదాబాద్‌ వేదికగా మెగా టోర్నీకి టాస్‌ పడనుంది. ఇప్పటికే వరల్డ్‌ కప్‌లో పాల్గొనే దేశాలు తమ స్క్వౌడ్‌లను ప్రకటించాయి. భారత సెలెక్టర్లు సైతం 15 మందితో కూడిన స్క్వౌడ్‌ను ప్రకటించింది. అయితే.. వరల్డ్‌ కప్‌కు ముందు టీమిండియా, ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌ కోసం కూడా సెలెక్టర్లు ఇప్పటికే జట్టును ప్రకటించారు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, హార్ధిక్‌ పాండ్యాలకు తొలి రెండు వన్డేలకు విశ్రాంతి ఇచ్చారు. అయితే.. ఆస్ట్రేలియా సిరీస్‌ కంటే కూడా క్రికెట్‌ అభిమానులంతా.. వరల్డ్‌ కప్‌ కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వరల్డ్‌ కప్‌ అనగానే.. అన్ని జట్లు ప్రాణం పెట్టి ఆడతాయి. కప్పు కొట్టేందుకు తమ వందశాతం ఎఫర్ట్‌ను పెడతాయి. ఆటగాళ్లు సైతం.. తమ బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. దాంతో ప్రతి మ్యాచ్‌ ఎంతో ఉత్కంఠగా, హోరాహోరీగా.. నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. అన్ని జట్లు బెస్ట్‌ టీమ్స్‌తో బరిలోకి దిగడంతో మ్యాచ్‌లో భారీ సిక్సులు, ఫోర్ల వర్షం, కళ్లు చెదిరే ఫీల్డింగ్‌, నిప్పులు చెరిగే బౌలింగ్‌తో.. అసలు సిసలైన క్రికెట్‌ బయటికి వస్తుంది. పైగా.. ఆధునిక క్రికెట్‌లో బ్యాటర్లు చాలా అలవోకగా భారీ సిక్సులు బాదేస్తున్నారు. గతం కంటే ఇప్పటి బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

అయితే.. వరల్డ్‌ కప్‌ కోసం ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ నిర్వహించే స్టేడియాల్లో బౌండరీ లైన్‌ దూరం కచ్చితంగా 70 మీటర్ల పైనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం బ్యాటర్లకు బ్యాడ్‌ న్యూస్‌ కాగా.. బౌలర్లు మాత్రం ఖుషీ అవుతున్నారు. ఎటు చూసినా 70 మీటర్లపైనే ఉంటే.. సిక్సులు కొట్టడం బ్యాటర్లకు అంత ఈజీ కాదు. కానీ.. పరుగులు తీసుకునే అవకాశం మాత్రం ఉంటుంది. ఏది ఏమైనా.. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో బౌలర్లకు కాస్త మేలు జరిగే అవకాశం ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రెండోసారి పెళ్లి చేసుకున్న షాహీన్ అఫ్రిది! స్పెషల్ అట్రాక్షన్ గా బాబర్..

Show comments