iDreamPost
android-app
ios-app

రెండోసారి పెళ్లి చేసుకున్న షాహీన్ అఫ్రిది! స్పెషల్ అట్రాక్షన్ గా బాబర్..

  • Author Soma Sekhar Published - 09:59 AM, Wed - 20 September 23
  • Author Soma Sekhar Published - 09:59 AM, Wed - 20 September 23
రెండోసారి పెళ్లి చేసుకున్న షాహీన్ అఫ్రిది! స్పెషల్ అట్రాక్షన్ గా బాబర్..

పాకిస్థాన్ స్టార్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది రెండోసారి పెళ్లి పీటలు ఎక్కాడు. కరాచీలో తన భార్య అన్షా అఫ్రిదిని మరోసారి నిఖా చేసుకున్నాడు. వీరిద్దరికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహం జరిగింది. తాజాగా మంగళవారం(సెప్టెంబర్ 19)న కరాచీలో మరోసారి వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ నిలిచాడు పాక్ కెప్టెన్ బాబర్ అజం. దానికి కారణం తెలియనిది కాదు. వీరిద్దరికి ఇటీవలే డ్రెస్సింగ్ రూమ్ లో గొడవ జరిగిన నేపథ్యంలో బాబర్ ఈ పెళ్లికి హాజరవడం ఆసక్తిగా మారింది. ఇక షాహీన్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ జంట రెండోసారి నిఖా ఎందుకు చేసుకున్నారు? అని మీకు అనుమానం రావొచ్చు. దానికి కారణం ఏంటంటే?

పాకిస్థాన్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది రెండోసారి తన భార్య అన్షా అఫ్రిదిని నిఖా చేసుకున్నాడు. ఈ జంట ఈ ఏడాది ఫిబ్రవరిలో నిఖాతో ఒక్కటైయ్యారు. అయితే అప్పుడు షాహీన్ బిజీ షెడ్యూల్ వల్ల అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే వీరి పెళ్లి జరిగింది. దీంతో పెళ్లికి అందరూ హాజరుకాలేదని.. మళ్లీ అందరి ముందు ఘనంగా పెళ్లి చేసుకోవాలని షాహీన్-అన్షాలు భావించారు. అందుకే వీరిద్దరు మరోసారి నిఖా చేసుకున్నారు. అంగరంగ వైభవంగా బంధువుల, మిత్రుల సమక్షంలో వీరి వివాహ వేడుకు జరిగింది. కాగా.. ఈ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు పాక్ కెప్టెన్ బాబర్ అజాం. ఇటీవలే షాహీన్ కు బాబర్ కు డ్రెస్సింగ్ రూమ్ లో గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబర్ ఈ పెళ్లికి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇక రెండోసారి పెళ్లి చేసుకోవడంపై ట్విట్టర్ ద్వారా స్పందించాడు షాహీన్ అఫ్రిది. “ఆ అల్లా మనల్ని జంటగా పుట్టిస్తాడు. మరోక మనిషిని ప్రేమించేలా చేస్తాడు. మీరు కూడా ఇస్లాం ప్రకారం త్వరగా నిఖా చేసుకోండి, మీ భాగస్వామితో జీవితాన్ని ఆస్వాదించండి. హరామ్(డేటింగ్) సంబంధాలకు దూరంగా ఉండండి” అంటూ రాసుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. షాహీన్ అఫ్రిది పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో కాదు.. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూతురు. ఇక షాహీన్ ఆసియా కప్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో 5 మ్యాచ్ లు ఆడి 10 వికెట్లు పడగొట్టాడు. మరి రెండోసారి షాహీన్ పెళ్లి చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom giriş