iDreamPost
android-app
ios-app

ఓటమి బాధలో బంగ్లాదేశ్.. షాకిచ్చిన ఐసీసీ!

  • Author Soma Sekhar Published - 03:32 PM, Wed - 11 October 23
  • Author Soma Sekhar Published - 03:32 PM, Wed - 11 October 23
ఓటమి బాధలో బంగ్లాదేశ్.. షాకిచ్చిన ఐసీసీ!

వరల్డ్ కప్ 2023లో భాగంగా తాజాగా ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ 364 పరుగుల భారీ స్కోర్ చేసింది. బంగ్లా బౌలర్లను చితకబాదుతూ.. ఇంగ్లీష్ బ్యాటర్ డేవిడ్ మలన్(140) భారీ శతకంతో కదంతొక్కాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా టీమ్ 227 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 137 పరుగుల తేడాతో ఘోర పరాభవాన్ని చవిచూసింది బంగ్లా టీమ్. ఓటమి భారంతో ఉన్న బంగ్లాకు మరో షాక్ తగిలింది. ఈ మ్యాచ్ లో బంగ్లా జట్టుకు షాకిచ్చింది ఐసీసీ.

ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఘోర పరాజయం పాలైన బంగ్లా జట్టుకు మరో షాక్ తగిలింది. ఈ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు మ్యాచ్ ఫీజ్ లో 5 శాతం కొత విధించింది ఐసీసీ. నిర్దేశించిన సమయంలోగా బంగ్లా టీమ్ తమ కోటా ఓవర్ల కంటే.. ఒక ఓవర్ వెనకబడి ఉంది. దీంతో ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం బంగ్లాదేశ్ జట్టు ఆటగాళ్లందరికీ ఈ ఫైన్ వర్తిస్తుంది. ఆన్ ఫీల్డ్ అంపైర్లు అయిన ఎహసాన్ రజా, పాల్ విల్సన్ లతో పాటు థర్డ్ అంపైర్లు అయిన అడ్రియన్ హోల్డ్ స్టాక్, ఫోర్త్ అంపైర్ కుమార ధర్మసేన బంగ్లాదేశ్ ప్లేయర్లపై చర్యలు తీసుకున్నారు. ఇక ఐసీసీ విధించిన ఈ జరిమానాను బంగ్లా సారథి షకీబ్ అల్ హసన్ కూడా అంగీకరించాడు. దీంతో అతడు ఐసీసీ ప్యానెల్ ముందు హాజరుకు మినహాయింపు లభించింది.