SNP
వన్డే వరల్డ్ కప్ 2023లో చెత్త ప్రదర్శనతో విమర్శల పాలైన పాకిస్థాన్‌కు తాజాగా మరో షాక్ తగిలింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ కూడా ఆ దేశానికి దక్కేలా లేదు. పాకిస్థాన్‌లో కాకుండా మరో చోట ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని ఐసీసీ భావిస్తోందటా.. మరి అందుకు కారణం, ఏ దేశంలో జరగనుందో ఇప్పుడు తెలుసుకుందాం..
వన్డే వరల్డ్ కప్ 2023లో చెత్త ప్రదర్శనతో విమర్శల పాలైన పాకిస్థాన్‌కు తాజాగా మరో షాక్ తగిలింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ కూడా ఆ దేశానికి దక్కేలా లేదు. పాకిస్థాన్‌లో కాకుండా మరో చోట ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని ఐసీసీ భావిస్తోందటా.. మరి అందుకు కారణం, ఏ దేశంలో జరగనుందో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2025లో పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఐసీసీ మార్పులు చేసినట్లు సమాచారం. ఇప్పటికే టీమిండియా పాకిస్థాన్ వెళ్లకపోవడంతో ఆసియా కప్ 2023 ట్రోఫీని పాకిస్థాన్‌తో పాటు శ్రీలంకలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నానా రచ్చ చేసింది. టీమిండియా తమ దేశానికి రావాల్సిందేనని, అలా రాకున్నా, తమ దేశంలో జరగాల్సిన ఆసియా కప్ ట్రోఫీని వేదిక మార్చి నిర్వహించినా తాము వన్డే వరల్డ్ కప్ 2023ను బాయ్‌కాట్ చేస్తామని కూడా హెచ్చరించింది. పాక్ బెదిరింపులను ఏ మాత్రం పట్టించుకోని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్.. ఆసియా కప్‌ను పాక్-శ్రీలంక సంయక్తంగా నిర్వహించేలా చేసింది. ఆపై పాక్ వరల్డ్ కప్ కూడా ఆడింది.
సరే తమ దేశంలో ఎలాగో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరుగుతుంది కదా అనే ధీమాలో ఉంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. కానీ, ఇప్పుడు వారి ఆశలపై ఐసీసీ నీళ్లు చల్లినట్లు సమాచారం. పాకిస్థాన్‌లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీని వేదిక మార్చి.. దుబాయ్‌లో నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కూడా టీమిండియానే కారణంగా నిలుస్తోంది. ఎందుకంటే.. అప్పుడు కూడా భారత జట్టును పాకిస్థాన్ పంపేందుకు భారత ప్రభుత్వం సుముఖంగా లేదని సమాచారం.
టీమిండియా లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ 2023ను క్రికెట్ అభిమానులు పట్టించుకోరు కనుక.. ఆ టోర్నీ మొత్తాన్ని దుబాయ్‌లో నిర్వహించాలని చూస్తోంది ఐసీసీ. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అందుకు ఒప్పుకోకుంటే.. కనీసం.. హైబ్రిడ్ మోడల్‌లో అయినా.. కొన్ని మ్యాచ్‌లో పాకిస్థాన్‌లో కొన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ అదే జరిగితే.. సేమ్ ఆసియా కప్ 2023 నిర్వహించినట్లు.. పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో.. ఇండియా ఆడే మ్యాచ్‌లో దుబాయ్‌లో నిర్వహిస్తారు. ఇక మిగతా జట్లు ఆడే మ్యాచ్‌లు కొన్ని పాక్‌లో కొన్ని దుబాయ్‌లో నిర్వహిస్తారు. ఏది ఏమైనా.. ఇండియాతో విరోధం.. పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం చేస్తోంది. ఇప్పటికైనా.. బుద్ధి మార్చుకుని భారత్‌తో సమరస్యంగా మెలగాలని నెటిజన్లు పాకిస్థాన్‌కు హితవు పలుకుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Pakistan is not hosting the ICC Champions Trophy. [Abhishek Tripathi]
Dubai is set to host the Champions Trophy or hybrid Model if the Indian Government doesn’t change the stance. pic.twitter.com/xNKhNckbmW
— Johns. (@CricCrazyJohns) November 27, 2023