iDreamPost
android-app
ios-app

వన్డే ర్యాంకింగ్స్ లో మెరిసిన ఇషాన్ కిషన్- కుల్దీప్ యాదవ్!

వన్డే ర్యాంకింగ్స్ లో మెరిసిన ఇషాన్ కిషన్- కుల్దీప్ యాదవ్!

టీమిండియా జట్టు వెస్టిండీస్ టూర్ లో సత్తా చాటుతోంది. టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా తర్వాత వన్డే సిరీస్ ని కూడా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా టీమిండియా ప్లేయర్లు సత్తా చాటారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒక్కో స్థానం కోల్పోగా.. బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్, బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్ మాత్రం వన్డే ర్యాకింగ్స్ లో ర్యాకింగ్స్ మెరుగు పరుచుకుని సత్తా చాటారు. వన్డే ర్యాకింగ్స్ లో ఇషాన్ కిషన్ 14 స్థానాలు, కుల్దీప్ యాదవ్ 8 ర్యాకింగ్స్  మెరుగు పరుచుకున్నారు.

ఇషాన్ కిషన్ కు వెస్టిండీస్ సిరీస్ బాగా ఉపయోగపడింది. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడనే చెప్పాలి. ఈ క్యాలెండర్ ఇయర్ లో ఇషాన్ రెండో టెస్టు, మూడు వన్డేల్లో వరుసగా 4 అర్ధ శతకాలు నమోదు చేశాడు. ఈ ప్రదర్శనతో ఇషాన్ కిషన్ ఏకంగా 14 స్థానాలు ఎగబాకి వన్డే ర్యాకింగ్స్ లో 45వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ కూడా ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్ సిరీస్ లో మూడు వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. వన్డే ర్యాంకింగ్స్ లో 8 స్థానాలు మెరుగు పరుచుకుని కుల్దీప్ 14వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఈ సిరీస్ లో రెండు వన్డేలకు దూరంగా ఉన్న కోహ్లీ, రోహిత్ శర్మ ఒక్కో స్థానం చొప్పున కోల్పోయారు.

టాప్ 10లో ఉన్న రోహిత్ శర్మ ఒక స్థానం కోల్పోయి టాప్ 11కి పడిపోయాడు.  కోహ్లీ కూడా ఒక స్థానం కోల్పోయి 9వ స్థానానికి చేరుకున్నాడు. శుభ్ మన్ గిల్ 724 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇంక టాప్ 1 విషయానికి వస్తే.. బ్యాటింగ్ లో పాక్ క్రికెటర్ బాబర్ అజామ్ 886 పాయింట్లతో తన తొలి స్థానాన్ని కొనసాగిస్తున్నాడు. 777 పాయింట్లతో వాండర్ డుసెన్ రెండో స్థానం, 755 పాయింట్లతో ఫఖర్ జమాన్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగాన్ని చూస్తే.. 705 పాయింట్లతో టాప్ ఉన్నాడు. 686 పాయింట్లతో మిచెల్ స్టార్క్ రెండో స్థానంలో, 682 పాయింట్లతో రషీద్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నారు. గాయం కారణంగా వన్డే సిరీస్ కు దూరమైన మహ్మద్ సిరాజ్ ఒక స్థానం కోల్పోయి 677 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.