క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే విశ్వ సమరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అక్టోబర్ 5 నుంచి ప్రపంచ కప్ ప్రారంభం కానుండగా.. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో మెుత్తం 10 జట్లు పాల్గొంటుండగా.. 45 రోజులు సాగుతుంది ఈ క్రికెట్ జాతర. మెుత్తం 48 మ్యాచ్ లు జరగనున్న ఈ విశ్వ సమరానికి సంబంధించి ప్రైజ్ మనీ వివరాలను ప్రకటించింది ఐసీసీ. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. మరి వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టుకు ఎన్ని కోట్లు ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ క్రికెట్ జాతర ప్రారంభం కానుంది. ఈ జాతర కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ ప్రపంచ సంగ్రామం ప్రైజ్ మనీకి సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ఐసీసీ. ఈ క్రమంలోనే 2019 వరల్డ్ కప్ కు కేటాయించిన ప్రైజ్ మనీనే ఈ వరల్డ్ కప్ కు కూడా కేటాయించింది. 2023 వరల్డ్ కప్ మెుత్తం ప్రైజ్ మనీ దాదాపు రూ. 83 కోట్లు కాగా.. ఛాంపియన్ గా నిలిచిన జట్టుకు రూ. 33.18 కోట్లు ఇవ్వనున్నారు. ఇక రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ.16.59 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది ఐసీసీ. సెమీ ఫైనల్స్ కు చేరిన ఒక్కొ జట్టుకు రూ. 6 కోట్లు దక్కనున్నాయి. అంతేకాకుండా గ్రూప్ దశలో ఒక్కో మ్యాచ్ గెలిస్తే.. రూ.33.18 లక్షలు బహుమతిగా అందుతాయి. నాకౌట్ కు చేరుకోలేకపోయిన ఒక్కో టీమ్ కు రూ.82.94 లక్షలు అందనున్నాయి. మరి వరల్డ్ కప్ ప్రైజ్ మనీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Prize money for ICC World Cup 2023: [approx]
Winners – 33 crores
Runner up – 16 crores
Two Semi-finals – 6 crores each
Group stage teams – 82 lakhs each pic.twitter.com/5F8M5plgTN— Johns. (@CricCrazyJohns) September 22, 2023