ఆసీస్ బౌలర్లను చితకొట్టిన ఆఫ్గాన్ ఓపెనర్.. రికార్డు శతకంతో..

  • Author Soma Sekhar Published - 06:46 PM, Tue - 7 November 23

వరల్డ్ క్లాస్ బౌలర్లు అని చెప్పుకునే ఆసీస్ బౌలింగ్ ను తుత్తునియలు చేస్తూ.. 291 పరుగులు చేసి ఔరా అనిపించింది ఆఫ్గాన్ జట్టు. ఇక ఈ మ్యాచ్ లో ఆఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహిం జద్రాన్ రికార్డు సెంచరీతో ప్రత్యర్థి బౌలింగ్ ను దంచికొట్టాడు.

వరల్డ్ క్లాస్ బౌలర్లు అని చెప్పుకునే ఆసీస్ బౌలింగ్ ను తుత్తునియలు చేస్తూ.. 291 పరుగులు చేసి ఔరా అనిపించింది ఆఫ్గాన్ జట్టు. ఇక ఈ మ్యాచ్ లో ఆఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహిం జద్రాన్ రికార్డు సెంచరీతో ప్రత్యర్థి బౌలింగ్ ను దంచికొట్టాడు.

  • Author Soma Sekhar Published - 06:46 PM, Tue - 7 November 23

వరల్డ్ కప్ లో ఆఫ్గానిస్తాన్ మరో సంచలనానికి దగ్గరలో ఉంది. ప్రపంచ కప్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిగా ఆస్ట్రేలియా-ఆఫ్గానిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ దుమ్మురేపుతూ.. కంగారూలను కంగారు పెట్టించింది. వరల్డ్ క్లాస్ బౌలర్లు అని చెప్పుకునే ఆసీస్ బౌలింగ్ ను తుత్తునియలు చేస్తూ.. 291 పరుగులు చేసి ఔరా అనిపించింది. ఇక ఈ మ్యాచ్ లో ఆఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహిం జద్రాన్ రికార్డు సెంచరీతో కదంతొక్కి.. చివరి వరకు అజేయంగా క్రీజ్ లో నిలబడ్డాడు. ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టుపై ఆఫ్గాన్ వంటి చిన్న జట్టు బ్యాటర్ ఈ స్థాయిలో చెలరేగడం అద్భుతమనే చెప్పాలి. అదీకాక ఆఫ్గాన్ తన చివరి 10 ఓవర్లలో 100 పరుగులు రాబట్టి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

వరల్డ్ కప్ లో కీలక మ్యాచ్ కు వాంఖడే స్టేడియం వేదికగా మారింది. కీలకమైన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా-ఆఫ్గాన్ జట్లు తలపడుతున్నాయి. ఇక ఇందులో గెలిచి సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆఫ్గాన్ 7 మ్యాచ్ ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఆసీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో గనుక విజయం సాధిస్తే.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. టాస్ గెలిచి మెుదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గాన్ కు అద్భుతమైన ఆరంభం ఏమీ లభించనప్పటికీ.. ఆ తర్వాత పుంజుకుంది. ఓపెనర్ గుర్బాజ్(21) విఫలం అయిప్పటికీ మరో ఓపెనర్ జట్టును ముందుండి నడింపించాడు.

ఆసీస్ బౌలర్లను ఎదుర్కొంటూ.. రికార్డు సెంచరీ నమోదు చేశాడు ఇబ్రహీం జద్రాన్. ఓవైపు వికెట్లు పడుతున్నాగానీ మెుక్కవోని ధైర్యంతో ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని అజేయ శతకంతో కదం తొక్కాడు జద్రాన్. ఓవరాల్ గా అతడు 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 129 పరుగులు చేసి చివరి వరకూ క్రీజ్ లో నిలబడ్డాడు. ఈ క్రమంలోనే ఒకే సంవత్సరం అత్యధిక పరుగులు చేసిన ఆఫ్గాన్ ఆటగాడిగా, వరల్డ్ కప్ హిస్టరీలో ఆసీస్ పై అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆఫ్గాన్ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు జద్రాన్. ఇక అతడిని ఔట్ చేయడం కోసం నానా కష్టాలు పడ్డారు ఆసీస్ బౌలర్లు. కానీ అతడు మాత్రం తన వికెట్ ను కోల్పోలేదు. అతడికి తోడు రహ్మత్ షా(30), షాహిది(26) చివర్లో రషీద్ ఖాన్ 18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి అజేయంగా నిలిచాడు.

దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆఫ్గాన్ 5 వికెట్లు కోల్పోయి 291 పరుగుల స్కోర్ చేసింది. వరల్డ్ చరిత్రలో ఆఫ్గాన్ అత్యధిక స్కోర్ ను నమోదు చేసి రికార్డు నెలకొల్పింది. అది కూడా ఆసీస్ లాంటి మేటి జట్టుపై కావడం విశేషం. గతంలో ఆఫ్గాన్ 2019 వరల్డ్ కప్ లో విండీస్ పై 288 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఆఫ్గాన్ కు అదే అత్యధిక స్కోర్ కాగా.. తాజాగా తన రికార్డును బ్రేక్ చేస్తూ ఆసీస్ ను బెంబేలెత్తించింది. అనంతరం 292 పరుగులు భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన ఆసీస్ కు ఆదిలోనే షాకిచ్చాడు మ్యాంగో మ్యాన్ నవీన్ ఉల్ హక్. తన తొలి ఓవర్ లోనే ట్రావిస్ హెడ్(0)ను పెవిలియన్ కు పంపి ఆఫ్గాన్ కు బ్రేక్ త్రూ ఇచ్చాడు. మరి వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదు అవుతుందో లేదో వేచి చూడాలి.

Show comments