SNP
Virat Kohli, Rajkumar Sharma: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు ఆయన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్. మరి ఏం చెప్పాడో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
Virat Kohli, Rajkumar Sharma: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు ఆయన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్. మరి ఏం చెప్పాడో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
SNP
టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. అంతెందుకు మన శత్రు దేశం పాకిస్థాన్‌లో కూడా అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్ అతను. అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎంతో నిలకడకగా రాణిస్తున్న ఏకైక క్రికెటర్. క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండూల్కర్ కెరీర్‌లో కూడా ఎత్తుపల్లాలు ఉన్నాయి. కానీ, కోహ్లీ సెంచరీ చేయకపోతేనే అతని కెరీర్ ముగిసినట్లు అంతా భావించారు. అంటే అతను సెట్ చేసిన స్టాండెడ్స్ అలాంటివి. కోహ్లీ 60 పరుగులు కొట్టినా.. అది క్రికెట్ అభిమానులు దృష్టిలో పెద్ద స్కోర్ కాదు. కోహ్లీ అంటే సెంచరీ చేయాలని వాళ్లు ఫిక్స్ అయిపోయారు.
ఇండియన్ క్రికెట్‌లో సూపర్ స్టార్‌గా ఒక వెలుగులు వెలుగుతున్న కోహ్లీ ప్రస్తుతం ఫేస్ ఆఫ్ ది వరల్డ్ క్రికెట్‌గా ఉన్నాడు. అయితే.. అలాంటి గొప్ప ఆటగాడికి చిన్నప్పుడు క్రికెట్ ఒనమాలు నేర్పించిన గురువు రాజ్‌కుమార్ శర్మ మాట్లాడుతూ.. గురు పౌర్ణిమ రోజు విరాట్ కోహ్లీ చిన్నప్పుడు తన వద్ద కోచింగ్ తీసుకున్నప్పు ఎలా ఉండే వాడు, ఏం చేసేవాడు అనే ఆసక్తికర విషయాలు ఆయన వెళ్లడించాడు. కోహ్లీ చాలా టాలెంట్ ఉన్న క్రికెట్ అని.. తన వద్ద కోచింగ్ కోసం వచ్చిన సమయంలో తన వయసు వారికంటే ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉండేవాడని, చాలా పవర్‌ఫుల్ షాట్లు రాజ్‌కుమార్ తెలిపాడు.
ఆయన మాట్లాడుతూ.. ‘తన వయసు వారికంటే ఎందుకు పవర్ కలిగి ఉండేవాడు. తన తోటివారికంటే బలంగా బాల్ హిట్ చేసేవాడు. పైగా మ్యాచ్‌లో అవుట్ అవ్వకుండా ఉండేవాడు. లాంగ్ ఇన్నింగ్స్‌లు ఆడటం అతనికి చిన్నతనం నుంచే అలవాటు. ఇదే నీకు చివరి సెషన్ అంటే.. లేదు సార్ నాకు ఇంకో రెండు సెషన్స్ ఆడే అవకాశం ఇవ్వండి అంటూ అడిగేవాడు. కొన్ని సార్లు నాతో తిట్లు కూడా తినేవాడు. కానీ, కోహ్లీ మంచి లెర్నర్. ఏది చెప్పిన వెంటనే గ్రాస్ప్ చేయగలడు. వెంటనే నేర్చుకుంటాడు.’ అంటూ కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మరి ఆయన చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“He was very fond of batting,” recalls #RajkumarSharma, @imVkohli‘s childhood coach, reminiscing about the day Virat joined his academy 😍
On the occasion of Guru Purnima, we honor the ‘gurus’ who guide us through life’s challenges 🙏#TeamIndia #GuruPurnima #Cricket pic.twitter.com/yojsk98kpc
— Star Sports (@StarSportsIndia) July 21, 2024