SNP
SNP
టీమిండియాలో మరో విరాట్ కోహ్లీలా మారిన యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ ఇండియన్ క్రికెట్‌కు ఫ్యూచర్ స్టార్‌లా ఎదుగుతున్నాడు. ప్రస్తుతం గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్లలో గిల్ ఎదురులేని ఫామ్‌లో కొనసాగుతున్నాడు. వన్డేల్లో అయితే గిల్ ఎంతో నిలకడగా రాణిస్తున్నాడు. వన్డేల్లో అతని డబుల్ సెంచరీ కూడా ఉంది. అలాగే టీ20ల్లో సెంచరీ సైతం సాధించాడు.
గిల్ చాలా కాలంగా ఐపీఎల్‌లో ఆడుతున్నా.. రెండేళ్లలో అతనిలో విశేషమైన మార్పు వచ్చింది. ఎంత పరిణతి చెందిన ఆటగాడిలా ఆడుతున్నాడు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్‌లో వేరియేషన్స్ చూసిస్తూ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా తన బ్యాటింగ్‌తో మెప్పిస్తున్నాడు. అయితే గిల్ ఇంత మెచ్యూర్ క్రికెటర్‌లా మారింది గుజరాత్ టైటాన్స్ టీమ్‌లో చేరిన తర్వాతే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
అంతకు ముందు కోల్‌కత్తా నైట్ రైడర్స్‌లో ఆడిన గిల్.. ఓపెనర్‌గా మంచి పేరు తెచ్చుకున్నా.. స్ట్రైక్‌రేట్ విషయంలో విమర్శలు ఎదుర్కొనేవాడు. అయితే గుజరాత్‌లో చేరిన తర్వాత మంచి స్ట్రైక్‌రేట్‌తో భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ మ్యాచ్ విన్నర్‌గా పేరు తెచ్చుకున్నాడు. కేకేఆర్ నుంచి గుజరాత్ ఫ్రాంచైజ్‌కు మారడం గిల్ కెరీర్‌కు టర్నింగ్‌లా నిలిచింది. అయితే.. గిల్‌కు గుజరాత్ టైటాన్స్ టీమ్‌లో చేరాలని సలహా ఇచ్చింది టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంట.. ఈ విషయం స్వయంగా గిల్ వెల్లడించాడు.
గుజరాత్ ఫ్రాంచైజీ తనను తీసుకోవాలనుకుంటుదన్న విషయాన్ని తనకు ముందుగా చెప్పింది యువరాజ్ సింగ్ అని, తను చెప్పాడనే గుజరాత్ టైటాన్స్‌లో చేరినట్లు గిల్ స్పష్టం చేశాడు. గుజరాత్ చాలా మంచి సెటప్, అక్కడ నువ్వు చాలా నేర్చుకుంటావ్ అని యువీ తనతో చెప్పాడని, అందుకే తాను కేకేఆర్ నుంచి గుజరాత్‌లోకి మారేందుకు ఆ ఫ్రాంచైజీకి ఓకే చెప్పినట్లు తెలిపాడు. యువరాజ్ ఏదైనా చెప్తే.. దానికి చాలా విలువ ఉంటుందని తనకు తెలుసని గిల్ పేర్కొన్నాడు. మరి గిల్ ఫ్రాంచైజ్ మారడం, యువీ ఇచ్చిన సలహాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: యూవీ దెబ్బకు అతని కెరీర్ క్లోజ్ అనుకున్నారు! కానీ, చరిత్ర సృష్టించాడు