టీ20 WC టీమ్‌లో చోటు దక్కడానికి కారణం వాళ్లే: దినేష్‌ కార్తీక్‌

Dinesh Karthik, T20 World Cup 2022, RCB: టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో చోటు దక్కించుకుని డీకే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. తనకు ఆ టీమ్‌లో ప్లేస్‌ వారి వల్లే దక్కిందంటూ అసలు నిజం బయటపెట్టాడు డీకే. అదేంటో వివరంగా తెలుసుకుందాం..

Dinesh Karthik, T20 World Cup 2022, RCB: టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో చోటు దక్కించుకుని డీకే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. తనకు ఆ టీమ్‌లో ప్లేస్‌ వారి వల్లే దక్కిందంటూ అసలు నిజం బయటపెట్టాడు డీకే. అదేంటో వివరంగా తెలుసుకుందాం..

దినేష్‌ కార్తీక్‌ ఇటీవల తన క్రికెట్‌ కెరీర్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ 2024లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌ తర్వాత డీకే తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్‌ ఆడుతూ.. ఎక్కువ టీమ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ప్లేయర్‌గా కూడా డీకే చరిత్ర సృష్టించాడు. రిటైర్మెంట్‌ తర్వాత తొలిసారి మాట్లాడుతూ.. డీకే కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ముఖ్యంగా టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో తనకు చోటు దక్కడంపై స్పందిస్తూ.. తనకు ప్లేస్‌ దక్కడానికి కారణం ఎవరో కూడా బయటపెట్టాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కంటే ముందు దాదాపు డీకే కెరీర్‌ ముగిసిపోయింది. అప్పటికే కామెంటేటర్‌గా కూడా సెటిల్‌ అయిపోయాడు డీకే.

కానీ ఐపీఎల్‌ 2022లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌కు ఆడుతూ.. ఫినిషర్‌గా అదరగొట్టాడు. 16 మ్యాచ్‌ల్లో 55.00 యావరేజ్‌, 183.33 స్టైక్‌రేట్‌తో 330 పరుగులు చేశాడు. చేసిన స్కోర్లని తక్కువ బంతుల్లో బాదుతూ.. ఆర్సీబీకి అద్భుతమైన ఫినిషర్‌గా మారాడు. ఆ దెబ్బతో టీమిండియాలో ఇలాంటి ఫినిషర్‌ ఉండాలని, టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌ కోసం డీకేను కన్సిడర్ చేయాలనే డిమాండ్‌ విపరీతంగా వినిపించింది. ముఖ్యంగా ఆర్సీబీ అభిమానులైతే.. డీకే వరల్డ్‌ కప్‌ 2022 టీమ్‌లో ఉండి తీరాల్సిందేనని పట్టుబట్టారు. ఆ డిమాండ్‌ ఎంత ప్రభావితం చేసిందంటే.. భారత సెలెక్టర్లు డీకేను టీ20 వరల్డ్‌ కప్‌ 2022కు ఎంపిక చేయకతప్పలేదు. క్రికెట్‌ చరిత్రలోనే ఇది బిగ్గెస్ట్‌ కమ్‌బ్యాక్‌గా నిలిచిపోయింది.

ఇదే విషయాన్ని ఇప్పుడు డీకే కూడా ఒప్పుకున్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2022 టీమ్‌లో తనకు చోటు దక్కడానికి ఆర్సీబీ అభిమానులే కారణం అంటూ.. దినేష్‌ కార్తీక్‌ పేర్కొన్నాడు. డీకే మాట్లాడుతూ.. ‘నేను కొన్నిసార్లు 2022 టీ20 ప్రపంచ కప్‌ కోపం నా ఎంపిక ఆర్సీబీ అభిమానుల కారణంగానే జరిగిందని నేను భావిస్తున్నాను. డీకే టీమ్‌లో ఉండాలని, 37 ఏళ్ల వయస్సులో కమ్‌బ్యాక్‌ ఇవ్వాలని ఆర్సీబీ అభిమానులు చాలా గట్టిగా డిమాండ్‌ చేశారు. వారి మద్దతు నేను ఎప్పటికీ మరచిపోలేను. ఆ టైమ్‌లో ఆర్సీబీ, ఆర్సీబీ అభిమానులు ముఖ్య పాత్ర పోషించారు’ అని డీకే వెల్లడించారు. కానీ, ఎన్నో అంచనాలతో టీ20 వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగిన డీకే దారుణంగా విఫలం అయ్యాడు. 4 మ్యాచ్‌ల్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. మరి టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కడానికి కారణం ఆర్సీబీ అని డీకే పేర్కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments