వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో సీనియర్ క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్‌ను టైమ్డ్ ఔట్‌గా అవ్వడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు క్రికెట్లో ఎన్ని రకాల ఔట్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో సీనియర్ క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్‌ను టైమ్డ్ ఔట్‌గా అవ్వడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు క్రికెట్లో ఎన్ని రకాల ఔట్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
క్రికెట్ వరల్డ్‌ను ఇప్పుడో ఉదంతం ఊపేస్తోంది. అదే ‘టైమ్డ్ ఔట్’. వన్డే ప్రపంచ్ కప్-2023లో భాగంగా శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‌లో సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ ఔటైన తీరుపై పెద్ద డిస్కషనే నడుస్తోంది. క్రీజులోకి వచ్చిన అతను గార్డ్ తీసుకోకుండానే తిరిగి హెల్మెట్ కోసం వెయిట్ చేశాడు. దీంతో బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ ఔట్ కోసం అప్పీల్ చేశాడు. నిర్ణీయ సమయం (2 నిమిషాలు)లోపు బ్యాటింగ్ మొదలుపెట్టని కారణంగా మాథ్యూస్‌ను అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. దీంతో మాథ్యూస్-షకీబ్ మధ్య వివాదం రాజుకుంది. నెక్స్ట్ బంగ్లా బ్యాటింగ్ టైమ్‌లో షకీబ్‌ను మాథ్యూస్ ఔట్ చేయడం.. తనకూ టైమ్ వచ్చిందని సైగలు చేయడం వైరల్‌గా మారింది.
మాథ్యూస్-షకీబ్ కాంట్రవర్సీ ఇక్కడితో ముగియలేదు. దీని వల్ల మ్యాచ్ ముగిశాక శ్రీలంక-బంగ్లాదేశ్ ప్లేయర్లు షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చుకోలేదు. అంతేగాక మ్యాచ్ తర్వాత మాథ్యూస్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన పదిహేనేళ్ల కెరీర్లో ఇలా దిగజారిపోయిన టీమ్‌ను ఎప్పుడూ చూడలేదన్నాడు. తాను క్రీజులో ఉంటే లంక గెలిచేదని తాను చెప్పడం లేదని.. కానీ కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలంటూ మాథ్యూస్ తీవ్రంగా స్పందించాడు. అయితే షకీబ్ మాత్రం తన చర్యను సమర్థించుకున్నాడు. రెండు నిమిషాల్లోపు రెడీగా ఉండకపోతే బ్యాట్స్‌మన్‌ను ఔట్‌గా ఇవ్వొచ్చని రూల్స్‌లో ఉందని.. అందుకే అప్పీల్ చేశానని షకీబ్ వెల్లడించాడు.
ఇక, మాథ్యూస్ ఉదంతంతో ‘టైమ్డ్ ఔట్’ అనేది ఒకటి ఉందని అందరికీ తెలిసొచ్చింది. కానీ క్రికెట్లో అనేక రకాల ఔట్లు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్యాట్స్‌మన్ కొట్టిన బాల్ గ్రౌండ్‌కు తగలకముందే గాల్లోనే ఫీల్డర్ పట్టుకుంటే దాన్ని కాట్గా లేదా క్యాచ్ ఔట్‌గా ప్రకటిస్తారు. బ్యాటర్ కొట్టిన బాల్‌ను వికెట్ల వెనుక ఉన్న కీపర్ లేదా స్లిప్స్‌లో ఉన్న ఫీల్డర్ పట్టుకుంటే కాట్ బిహైండ్‌గా ఇస్తారు. అదే బౌలర్ డైరెక్ట్‌గా క్యాచ్ పట్టుకుంటే కాట్ అండ్ బౌల్డ్‌గా ప్రకటిస్తారు.
బౌలర్ వేసిన బాల్ లీగల్ డెలివరీ అయి బ్యాట్స్‌మెన్‌ను దాటుకొని వికెట్లను తాకితే దాన్ని బౌల్డ్ అంటారు. నేరుగా వికెట్లను తాకినా లేదా బ్యాటర్ బాడీకి తగిలి స్టంప్స్‌ను గిరాటేసినా బౌల్డ్‌గా ప్రకటిస్తారు.
వికెట్ల ముందు బ్యాటర్ దొరికిపోతే దాన్ని ఎల్బీడబ్ల్యూ అంటారు. బ్యాట్‌ను గానీ బ్యాటర్ గ్లౌవ్‌ను గానీ తగలకుండా నేరుగా బ్యాట్స్‌మన్ శరీరంలోని ఏ పార్ట్‌ను టచ్ అయినా ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేయొచ్చు. అయితే ఆ బాల్ బ్యాటర్ శరీరం లేదా ప్యాడ్స్ తగిలే లైన్, స్టంప్స్‌కు నేరుగా ఉందా లేదా లాంటి కొన్ని విషయాలను బట్టి ఔట్‌గా ప్రకటిస్తారు.
షాట్ కొట్టాక రన్ తీసేందుకు ప్రయత్నించే క్రమంలో బ్యాటర్ తిరిగి క్రీజులోకి చేరుకోవాలి. ఒకవేళ క్రీజుకు దూరంగా ఉన్నప్పుడే ఫీల్డర్, కీపర్ లేదా బౌలర్ బాల్‌తో వికెట్లను గిరాటేస్తే రనౌట్‌గా ఇస్తారు. ఒక్కోసారి బాల్ బాడీకి తగిలినా, అసలు దేనికీ తగలకపోయినా రన్ తీస్తారు. ఈ టైమ్‌లో కూడా క్రీజులోకి చేరేలోపు రనౌట్ చేయొచ్చు.
బ్యాట్స్‌మెన్ క్రీజును విడిచి బాల్‌ను కొట్టేందుకు ముందుకు వస్తుంటారు. ఒకవేళ షాట్ మిస్సయిందంటే తిరిగి వెనక్కి చేరుకోవాలి. ఒకవేళ కీపర్ బాల్‌తో వికెట్లను పడేసే లోపు బ్యాటర్ క్రీజులోకి రాకపోతే దాన్ని స్టంప్డ్గా ప్రకటిస్తారు.
ఒక బ్యాట్స్‌మన్ అనారోగ్యం, ఇంజ్యురీ కాకుండా ఇతర ఏ కారణం వల్లనైనా క్రీజును వీడాలంటే అంపైర్లకు సమాచారం ఇవ్వాలి. అలాగే ప్రత్యర్థి టీమ్ కెప్టెన్ దీనికి ఒప్పుకోవాలి. అలా చేస్తేనే తిరిగి ఇన్నింగ్స్‌ను కొనసాగించొచ్చు. ఒకవేళ తిరిగి క్రీజులోకి రాకపోతే ఆ బ్యాటర్‌ను రిటైర్డ్ ఔట్‌గా ప్రకటిస్తారు.
ఒకవేళ బ్యాటర్ బాల్‌ను రెండుసార్లు కొడితే దాన్ని ఔట్‌గా ప్రకటిస్తారు. బాడీతో గానీ బ్యాట్‌తో కానీ బాల్‌ను కావాలనే రెండోసారి కొట్టేందుకు ప్రయత్నిస్తే హిట్ ద బాల్ ట్వైస్ కింద ఔట్‌గా ఇవ్వొచ్చు.
బ్యాట్స్‌మన్ షాట్ కొట్టే క్రమంలో వికెట్లను బ్యాట్‌తో గానీ బాడీతో కానీ పడేస్తే దాన్ని హిట్ వికెట్‌గా ప్రకటిస్తారు.
ఇదీ చదవండి: ‘TIMED OUT’ నుంచి తప్పించుకున్న గంగూలీ.. షకీబ్లా గ్రేమ్ స్మిత్ చేసుంటే..?