iDreamPost

‘TIMED OUT’​ నుంచి తప్పించుకున్న గంగూలీ.. షకీబ్​లా గ్రేమ్ స్మిత్ చేసుంటే..?

  • Author singhj Published - 09:43 AM, Tue - 7 November 23

ఒక బ్యాట్స్​మన్ ఔట్ అవ్వడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాటిల్లో టైమ్డ్ ఒకటి. కానీ దీని గురించి ఇప్పటిదాకా ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే లంక ఆల్​రౌండర్ మాథ్యూస్ ఔట్​తో ఒక్కసారిగా టైమ్డ్ ఔట్ అనేది వైరల్ అయిపోయింది.

ఒక బ్యాట్స్​మన్ ఔట్ అవ్వడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాటిల్లో టైమ్డ్ ఒకటి. కానీ దీని గురించి ఇప్పటిదాకా ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే లంక ఆల్​రౌండర్ మాథ్యూస్ ఔట్​తో ఒక్కసారిగా టైమ్డ్ ఔట్ అనేది వైరల్ అయిపోయింది.

  • Author singhj Published - 09:43 AM, Tue - 7 November 23
‘TIMED OUT’​ నుంచి తప్పించుకున్న గంగూలీ.. షకీబ్​లా గ్రేమ్ స్మిత్ చేసుంటే..?

గేమ్ స్పిరిట్.. క్రీడల్లో ఎక్కువగా వినిపించే పదం ఇది. ముఖ్యంగా కాంట్రవర్సీ టైమ్​లో క్రీడా స్ఫూర్తి అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పుడు క్రికెట్ దునియాను ఊపేస్తున్న ‘టైమ్డ్ ఔట్’ వివాదం విషయంలోనూ గేమ్ స్పిరిట్​ను చాలా మంది వాడుతున్నారు. వరల్డ్ కప్​-2023లో భాగంగా బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో శ్రీలంక సీనియర్ క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్​ అయిన విషయం తెలిసిందే. హెల్మెట్ పెట్టుకొని క్రీజులోకి వచ్చిన అతడు బ్యాటింగ్​కు రెడీగా ఉన్నట్లు కనిపించాడు. కానీ హెల్మెట్ పట్టీ తెగిపోవడంతో మరో హెల్మెట్ తీసుకురావాలని డగౌట్​లో ఉన్నవారికి సూచించాడు. అయితే ఆలస్యమవ్వడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ అంపైర్ దగ్గరకు వెళ్లి అప్పీల్ చేశాడు. 2 నిమిషాల్లోనే బ్యాటింగ్​కు రావాల్సిన మాథ్యూస్ లేట్ చేయడంతో అంపైర్ కూడా టైమ్డ్ ఔట్​గా ప్రకటించాడు.

క్రికెట్ హిస్టరీలో ఇలా ఒక బ్యాట్స్​మన్ పెవిలియన్​కు చేరుకోవడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ వివాదంలో షకీబ్ తప్పని కొందరు అంటుంటే.. మరికొందరు మాథ్యూస్​ది తప్పని అంటున్నారు. హెల్మెట్​లో ఇబ్బంది ఉంటే ముందే చూసుకోవాలని, నిర్ణీత టైమ్​లోగా క్రీజులోకి వచ్చి బ్యాటింగ్ చేయడం రూల్ అని దాన్ని పాటించాల్సిందేనని చెబుతున్నారు. షకీబ్ చేసిన దాంట్లో తప్పేమీ లేదని అతడికి సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ సపోర్ట్ చేస్తున్నారు. రూల్స్ బౌలర్లకేనా, బ్యాటర్లకు ఉండవా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం మాథ్యూస్ రిక్వెస్ట్ చేశాకైనా షకీబ్ తన అప్పీల్​ను వెనక్కి తీసుకోవాల్సిందని చెబుతున్నారు. అయితే క్రికెట్ హిస్టరీలో ఇలా టైమ్డ్ ఔట్ ఘటనలు కొన్ని జరిగాయి. అయితే అవి డొమెస్టిక్ లెవల్లో చోటుచేసుకున్నాయి.

ఇంటర్నేషనల్ క్రికెట్​లో కూడా ఒక మ్యాచ్​లో భారత లెజెండ్ సౌరవ్ గంగూలీ టైమ్డ్ ఔట్ కావాల్సింది. కానీ ఆ రోజు దాదా తప్పించుకున్నాడు. 2007లో కేప్​టౌన్​లో టీమిండియా, సౌతాఫ్రికా టీమ్స్ మధ్య ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది. అందులో బ్యాటింగ్​కు గంగూలీ ఏకంగా 6 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. రెండో ఇన్నింగ్స్​లో ఇద్దరు భారత ఓపెనర్లు త్వరగా ఔటయ్యారు. దీంతో నాలుగో ప్లేస్​లో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్​కు రావాల్సి ఉంది. కానీ మూడో రోజు ఆటలో మాస్టర్ బ్లాస్టర్ గ్రౌండ్​లో ఎక్కువ సేపు లేని కారణంగా నాలుగో రోజు మార్నింగ్ 10.48 గంటల తర్వాతే మైదానంలోకి అడుగుపెట్టాల్సి ఉంది. సచిన్ రావొద్దని అంపైర్లు ఆలస్యంగా సమాచారం ఇవ్వడం, వీవీఎస్ లక్ష్మణ్ స్నానానికి వెళ్లిపోవడంతో గంగూలీ హడావుడిగా డ్రెస్ మార్చుకున్నాడు.

దాదా ప్యాడ్స్ కట్టుకొని, హెల్మెట్ పెట్టుకొని గ్రౌండ్​లోకి దిగేందుకు 6 నిమిషాల టైమ్ పట్టింది. రూల్స్ ప్రకారం ఒక బ్యాటర్ ఔటైన తర్వాత కొత్త బ్యాట్స్​మన్ 3 నిమిషాల్లోపే క్రీజులోకి రావాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాటర్ నిబంధనలు మీరితే.. అపోజిషన్ టీమ్ కెప్టెన్ గనుక అప్పీల్ చేస్తే ఆ బ్యాట్స్​మన్​ను ఔట్​గా ప్రకటిస్తారు. నిన్నటి మ్యాచ్​లో ఇలాగే మాథ్యూస్​ను ఔట్​గా ఇచ్చారు. అయితే లంకతో మ్యాచ్​లో బంగ్లా కెప్టెన్ షకీబ్ అప్పీల్​కు వెళ్లాడు. కానీ 2007లో ఇండియాతో మ్యాచ్​లో సఫారీ టీమ్ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అలా చేయలేదు. అప్పీల్ చేసేందుకు తిరస్కరించి గేమ్ స్పిరిట్​ను చాటుకున్నాడు. మాథ్యూస్ వివాదంతో ఇప్పుడు స్మిత్​పై ప్రశంసల వర్షం కురుస్తోంది. షకీబ్​లా అప్పట్లో గ్రేమ్ స్మిత్ చేసుంటే దాదా ఔటయ్యేవాడు. మరి.. మాథ్యూస్-షకీబ్ వివాదంలో తప్పెవరిదని అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియా కాదు.. కోహ్లీనే రియల్ బ్రాండ్.. ఇదిగో ప్రూఫ్​!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి