Swetha
సినిమాలంటే తెలుగు హీరోలే తెలుగు వారే ఎక్కువ చూసేవాళ్ళు. మార్కెట్ లో కూడా తెలుగు వారికే ఎక్కువగా ఉండేది. తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ఓ పండగ. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. ఇండియన్ సినిమాలు ఇంటెర్నేషనల్ లెవెల్ కు చేరుకున్నాయి.
సినిమాలంటే తెలుగు హీరోలే తెలుగు వారే ఎక్కువ చూసేవాళ్ళు. మార్కెట్ లో కూడా తెలుగు వారికే ఎక్కువగా ఉండేది. తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ఓ పండగ. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. ఇండియన్ సినిమాలు ఇంటెర్నేషనల్ లెవెల్ కు చేరుకున్నాయి.
Swetha
సినిమాలంటే తెలుగు హీరోలే తెలుగు వారే ఎక్కువ చూసేవాళ్ళు. మార్కెట్ లో కూడా తెలుగు వారికే ఎక్కువగా ఉండేది. తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ఓ పండగ. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. ఇండియన్ సినిమాలు ఇంటెర్నేషనల్ లెవెల్ కు చేరుకున్నాయి. ముఖ్యంగా జపాన్ మార్కెట్ లో తెలుగు సినిమాలకు డిమాండ్ బాగ ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు పుష్ప 2 ను.. ‘పుష్ప కున్రిన్’ అనే పేరుతో జనవరి 16 న అక్కడ రిలీజ్ చేస్తున్నారు.
అయితే ఎందుకు జపాన్ నే చూస్ చేసుకున్నారు అనే విషయానికొస్తే.. దానికి కారణం ఆర్ఆర్ఆర్ సినిమానే. ఆ సినిమా తర్వాత ఇండియన్ మూవీ మీద జపాన్ వారికి అభిమానం బాగా పెరిగింది. రజనీకాంత్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి ఇండియన్ స్టార్స్‌కు జపాన్‌లో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ కు కూడా ఆ ఫ్యాన్ బేస్ పెరిగారు. మన తెలుగు పాటలకు జపాన్ వారు రీల్స్ వీడియోస్ చేసి సోషల్ మీడియాలో ఎలా అప్లోడ్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాము. సో అందుకే ఈ సినిమాను జపాన్ లో రిలీజ్ చేయనున్నారు.
అలాగే దీనికి సంబంధించి సుకుమార్ ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ను షేర్ చేసుకున్నారు. ఈ సినిమా కథ జపాన్ హార్బర్ సీన్‌తో మొదలవుతుందట. అసలు పుష్ప జపాన్ ఎందుకు వెళ్లాడు? అనే ప్రశ్నపై ఉన్న సస్పెన్స్‌ను పుష్ప 3 లో చూపించనున్నట్లు సుకుమార్ తెలిపారు. కల్కి’, ‘దేవర’ వంటి కొన్ని పెద్ద సినిమాలు జపాన్‌లో విడుదలైనప్పటికీ, అనుకున్న స్థాయిలో హిట్ దక్కించుకోలేకపోయాయి. మరి పుష్ప 2 పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇండియన్ మేకర్స్ జపాన్ మార్కెట్‌ను పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇక ముందు ముందు ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.