Swetha
అన్ని అనుకున్నట్లు జరిగితే ఈపాటికి అఖండ 2 రిజల్ట్స్ గురించి అంతా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఎక్కడెక్కడ సినిమా సత్తా చూపిస్తుంది అనే విషయాలు , రివ్యూలు బయటకు వచ్చేవి. కానీ ఊహించని విధంగా లాస్ట్ మూమెంట్ లో సినిమా షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్ లో ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదు

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈపాటికి అఖండ 2 రిజల్ట్స్ గురించి అంతా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఎక్కడెక్కడ సినిమా సత్తా చూపిస్తుంది అనే విషయాలు , రివ్యూలు బయటకు వచ్చేవి. కానీ ఊహించని విధంగా లాస్ట్ మూమెంట్ లో సినిమా షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్ లో ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదు. బాలయ్య అనే కాదు అసలు లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అవ్వడం ఇదే మొదటిసారేమో. ఎంత లేదన్న కనీసం రెండు రోజుల ముందైనా క్యాన్సిల్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కానీ అఖండ విషయంలో జరిగింది వేరే.
ఫైనాన్స్ ఇష్యూలతో సినిమాల రిలీజ్ ఆలస్యం అవుతుందన్న మ్యాటర్ ఎప్పటినుంచో ఉంది. కానీ మరీ ఇలా ఈ రేంజ్ లో లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ అవ్వడం వరకు వెళ్లిందంటే.. సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించాల్సిన పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీకి గుణపాఠం నేర్పినట్టు అయింది. సినిమా తీసేముందు లేదా సినిమా తీసే ప్రాసెస్ లో చాలానే సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను సినిమా రిలీజ్ కు ముందే సాల్వ్ చేసుకుంటే మంచిది.
లేదంటే ఇలా ఆఖరి నిమిషంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిగతా సమయాల్లో సైలెంట్ గా ఉండే ఫైనాన్షియర్లు కూడా రిలీజ్ టైంలో పీక మీద కత్తి పెట్టి సినిమా రిలీజ్ ను అడ్డుకునే పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇకనుంచైనా మిగిలిన సినిమాల వాళ్ళు ఈ విషయాల్లో కేర్ తీసుకుంటే బావుంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.