SRH టీమ్‌లో సూపర్‌ ‍స్టార్స్‌, లెజెండ్‌ ఎవరో చెప్పిన క్లాసెన్‌!

Heinrich Klaasen: ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ పవరేంటో చూపిస్తున్న క్లాసెన్‌.. తన టీమ్‌లో సూపర్‌ స్టార్‌ ఎవరు? లెజెండ్‌ ఎవరో చెప్పేశాడు. మరి క్లాసెన్‌ ఎవర్ని లెజెండ్‌ అన్నాడో ఇప్పుడు చూద్దాం..

Heinrich Klaasen: ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ పవరేంటో చూపిస్తున్న క్లాసెన్‌.. తన టీమ్‌లో సూపర్‌ స్టార్‌ ఎవరు? లెజెండ్‌ ఎవరో చెప్పేశాడు. మరి క్లాసెన్‌ ఎవర్ని లెజెండ్‌ అన్నాడో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మంచి ఊపుమీదుంది. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్‌ 3 మ్యాచ్‌ల్లో గెలిచి.. 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5 స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ నమోదు చేసింది. ఈ నెల 15న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ ఆడనుంది. టీమ్‌లోని స్టార్‌ ప్లేయర్లంతా ఫామ్‌లో ఉండటం ఎస్‌ఆర్‌హెచ్‌కు కలిసి వస్తోంది. ముఖ్యంగా విధ్వంసకర బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ ఆడుతున్న తీరుతో ఎస్‌ఆర్‌హెచ్‌ అంటేనే మిగతా జట్లు భయపడుతున్నాయి. సీజన్‌ ఆరంభంలో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓ సాధారణ టీమ్‌గా చూసిన అభిమానులు ఇప్పుడు ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌లు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

ఎస్‌ఆర్‌హెచ్‌ను చూసే విధానంలో ఇంత తేడా వచ్చిందంటే అది క్లాసెన్‌ కాకా వల్లే అంటే అతిశయోక్తి కాదు. అయితే.. తాజాగా క్లాసెన్‌ టీమ్‌లోని ఇతర ప్లేయర్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన టీమ్‌మేట్స్‌ గురించి.. వన్‌ వర్డ్‌ సమాధానాలు ఇస్తూ.. కొంతమంది క్రికెటర్లను ఆకాశానికి ఎత్తేశాడు. ఒకరిద్దరిని సూపర్‌ స్టార్లుగా అభివర్ణించిన క్లాసెన్‌.. ఓ ఇండియన్‌ క్రికెటర్‌ను మాత్రం లెజెండ్‌గా పేర్కొన్నాడు. మరి క్లాసెన్‌ చెప్పిన ఆ సూపర్‌ స్టార్లు, లెజెండ్‌ ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ముందుగా ఎస్‌ఆర్‌హెచ్‌ మాజీ కెప్టెన్‌ ఎడెన్‌ మార్కరమ్‌ పేరు చెప్పగా.. పవర్‌ ఫుల్‌ అండ్‌ లైకబుల్‌ అని చెప్పాడు. తర్వాత టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌ పేరు చెప్తే.. టాలెంటెడ్‌, స్పెషల్‌ కారెక్టర్‌ అని పేర్కొన్నాడు. అలాగే.. నటరాజన్‌కు క్వైట్‌ అండ్‌ వెరీ స్కిల్‌ఫుల్‌ అని, యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మను సూపర్‌ స్టార్‌ అని యూనిక్‌ అని కితాబిచ్చాడు. తన దేశస్థుడు మార్కో జాన్సెన్‌ గురించి అడిగితే.. ఫేటల్‌(‍ప్రాణాంతకం), ఫన్నీ అని బదులిచ్చాడు.

ఇక టీమిండియా సీనియర్‌ బౌలర్‌, ఎస్‌ఆర్‌హెచ్‌కు ఎప్పటి నుంచో ఆడుతున్న భువనేశ్వర్‌ కుమార్‌ను లెజెండ్‌ అన్నాడు క్లాసెన్‌. అతను మాట్లాడిన వీడియోలో ఇదే హైలెట్‌పాయింట్‌గా నిలిచింది. అలాగే ఎంతో స్కిల్‌ఫుల్‌ అని, తాను ఎదుర్కొన్న బెస్ట్‌ బౌలర్‌ అని పేర్కొన్నాడు. ఆ తర్వాత గ్లెన్‌ ఫిలిప్స్‌ను స్ట్రాంగ్‌ అండ్‌ యూనిక్‌ అని, ట్రావిస్‌ హెడ్‌ అంటే టాలెంటెడ్‌ అండ్‌ సూపర్‌ స్టార్‌ అని తెలిపాడు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ కోచ్‌ డానియల్‌ వెటోరి పేరు చెప్పగానే ఐడిల్‌ అండ్‌ వెరీ ఫన్నీ అని పేర్కొన్నాడు. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ అంటే అతనంటే తనకు భయమని, నిజానికి అతను ఫన్నీ గాయ్‌ అంటూ తెలిపాడు. చివరిగా మయాంక్‌ అగర్వాల్‌ గురించి అడితే.. హంబుల్‌, ఒక గొప్ప స్నేహితుడని పేర్కొన్నాడు. మరి ఎస్‌ఆర్‌హెచ్‌లోని స్టార్‌ ఆటగాళ్ల గురించి క్లాసెన్‌ చెప్పిన వన్‌ వర్డ్‌ ఆన్సర్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments