iDreamPost
android-app
ios-app

వీడియో: HYD నడిబొడ్డులో క్లాసెన్ కాకా మాస్ క్రేజ్! కటౌట్స్ పెట్టించుకునే అభిమానం!

  • Published Mar 30, 2024 | 3:24 PM Updated Updated Mar 30, 2024 | 3:24 PM

Heinrich Klaasen: ఐపీఎల్‌2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. అది హెన్రిచ్‌ క్లాసెన్‌ వల్ల.. రెండు వరుస మ్యాచ్‌ల్లో తన బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు. దాంతో.. తెలుగు క్రికెట్‌ ఫ్యాన్స్‌ క్లాసెన్‌పై తమ అభిమానం కురిపిస్తున్నారు.

Heinrich Klaasen: ఐపీఎల్‌2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. అది హెన్రిచ్‌ క్లాసెన్‌ వల్ల.. రెండు వరుస మ్యాచ్‌ల్లో తన బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు. దాంతో.. తెలుగు క్రికెట్‌ ఫ్యాన్స్‌ క్లాసెన్‌పై తమ అభిమానం కురిపిస్తున్నారు.

  • Published Mar 30, 2024 | 3:24 PMUpdated Mar 30, 2024 | 3:24 PM
వీడియో: HYD నడిబొడ్డులో  క్లాసెన్ కాకా మాస్ క్రేజ్! కటౌట్స్ పెట్టించుకునే అభిమానం!

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడిన రెండో మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ బాదిన టీమ్‌గా ఎస్‌ఆర్‌హెచ్‌ నిలిచింది. అది కూడా ముంబై ఇండియన్స్‌ లాంటి ఓ స్ట్రాంగ్‌ టీమ్‌పై 20 ఓవర్లలో 277 పరుగుల అత్యంత భారీ స్కోర్‌ నమోదు చేసి.. కొత్త హిస్టరీ క్రియేట్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ముంబై బౌలర్లపై ఒక ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. కేవలం 34 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్సులతో 80 పరుగులు చేసి.. ముంబై బౌలర్లను వణికించాడు. దాంతో క్లాసెన్‌ పేరు క్రికెట్‌ వర్గాల్లో మారుమోగిపోయింది. తెలుగు క్రికెట్‌ అభిమానులు కూడా క్లాసెన్‌ను ఈ ఇన్నింగ్స్‌తో చాలా ఓన్‌ చేసుకున్నారు.

గతంలో.. డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌లపై కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ ఇదే విధమైన ప్రేమను చూపించారు. వార్నర్‌ను డేవిడ్‌ భాయ్‌ అంటూ.. విలియమ్సన్‌ను కేన్‌ మామ అంటూ ముద్దు పేర్లతో కూడా పిలుచుకునేవారు. ఇప్పుడు హెన్రిచ్‌ క్లాసెన్‌ను.. క్లాసెన్‌ కాకా అంటూ నెత్తిన పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌ వేరే టీమ్స్‌కు ఆడుతున్నా.. వారిపై ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ అదే అభిమానం చూపిస్తారు కానీ, వారిని ఎప్పుడూ ద్వేషించలేదు. గత ఏడాది కూడా క్లాసెన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున ఆడినా.. ఈ స్థాయి ప్రేమ కనిపించలేదు. ఇప్పుడు మాత్రం పరిస్థితి నెక్ట్స్‌ లెవల్‌లో ఉంది. కొంతకాలంగా మిస్‌ అవుతున్న ఫ్యాన్‌ సపోర్ట్‌ అనేది ఇప్పుడు మళ్లీ తిరిగి క్లాసెన్‌తో వచ్చినట్లు అనిపిస్తోంది.

Classen Kaka Mass Craze in HYD!

ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో క్లాసెన్‌ కటౌట్‌లు దర్శనం ఇస్తున్నాయి. ఇండియాలో కేవలం టీమిండియా క్రికెటర్లకు మాత్రమే కటౌట్లు కనిపిస్తూ ఉంటాయి. సచిన్‌ టెండూల్కర్‌, మహేంద్ర సింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, సంజు శాంసన్‌ల కటౌట్లను వారి వారి అభిమానులు పోటీ పడి మరి పెడుతుంటారు. ఈ క్రమంలోనే క్లాసెన్‌కు కూడా అదిరిపోయే కటౌట్‌ను హైదరాబాద్‌లో పెట్టారు. ప్రస్తుతం ఆ కటౌట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరి క్లాసెన్‌కు హైదరాబాద్‌ నడిబొడ్డులో కటౌట్లు పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.