Rohit Sharma: భారత జట్టును ‘ఇది రోహిత్‌ శర్మ టీమ్‌’ అని గంభీర్‌ ఎందుకన్నాడు?

Indian team It will always be Rohit sharma team, Gautam Gambhir: బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Indian team It will always be Rohit sharma team, Gautam Gambhir: బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు టీమిండియా సిద్ధం అవుతోంది. ప్లేయర్లు అందరూ నెట్స్ లో చమటోడుస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కెప్టెన్ రోహిత్ శర్మ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. భారత జట్టును ‘ఇది రోహిత్ శర్మ టీమ్’ అని జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. గంభీర్ ఇలా ఎందుకు అన్నాడు? దానికి అర్థం ఏంటి? అని క్రికెట్ అభిమానులు ఆరా తీస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. హిట్ మ్యాన్ గొప్ప నాయకుడు అంటూ పేర్కొంటూనే అతడితో తనకు ఉన్న అనుబంధాన్ని గురించి వివరించాడు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు గంభీర్. భారత జట్టును ‘ఇది రోహిత్ శర్మ టీమ్’ అని ప్రత్యేకంగా సంభోదించాడు. ప్రస్తుతం ఈ మాటలు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గంభీర్ జియో సినిమాతో మాట్లాడుతూ..”రోహిత్ శర్మ గొప్ప వ్యక్తి. అతడికి డ్రెస్సింగ్ రూమ్ లో చాలా  గౌరవం ఉంటుంది. ఇక అతడితో కలిసి ఆడిన టైమ్ లో నాకు రోహిత్ తో మంచి అనుబంధం ఉంది. గ్రేట్ హ్యూమన్ బియింగ్. పైగా ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తాడు. యంగ్ ప్లేయర్లను జూనియర్లుగా అస్సలే చూడడు. అందుకే నేను జట్టును ఇది ఎల్లప్పటికీ రోహిత్ టీమ్ అని అంటాను” అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే.. భారత జట్టును ఇది రోహిత్ టీమ్ అని గౌతమ్ గంభీర్ కామెంట్ చేయడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ వ్యాఖ్యలకు అర్థం ఏంటి? అని క్రికెట్ లవర్స్ తెగ ఆలోచిస్తున్నారు. ఇక గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రత్యేకించి ఎలాంటి కారణాలు లేవు.. కానీ.. టీమ్ కోసం ఎల్లప్పపుడు పరితపిస్తూ, ప్లేయర్లకు గౌరవం ఇస్తూ, స్వేచ్చగా ఆడుకునేందుకు రోహిత్ వెసులుబాటు కల్పిస్తాడు. ఇక నాయకత్వం విషయంలో హిట్ మ్యాన్ కు తిరుగులేదు. తన కెప్టెన్సీలో ఎన్నో మరపురాని విజయాలను జట్టుకు అందించాడు. ఇటీవలే టీ20 వరల్డ్ కప్ ను సైతం భారత్ ఖాతాలో వేశాడు. టీమ్ కోసం అహర్నిశలు పరితపించే వ్యక్తి రోహిత్ కావడంతోనే గౌతమ్ గంభీర్ ఇది రోహిత్ టీమ్ అని అన్నాడు. మరి హిట్ మ్యాన్ పై గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments