SNP
SNP
టీమిండియా మాజీ కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ సంచలన విషయం బయటపెట్టాడు. టీమిండియాలో చాలా కాలం తిరుగులేని ఓపెనర్‌గా కొనసాగిన సెహ్వాగ్‌పై ఒకప్పటి కోచ్ జాన్ రైట్ చేయి చేసుకున్నాడంటా. ఈ షాకింగ్ విషయాన్ని స్వయంగా సెహ్వాగే వెల్లడించాడు. ఒక విదేశీ కోచ్, భారత్ లాంటి పెద్ద టీమ్‌లోని స్టార్ క్రికెటర్‌పై చేయి చేసుకోవడం ఏంటంటూ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన 2002లో జరిగింది. అయితే.. ఇప్పటి వరకు ఈ విషయం బయటకి పొక్కకపోవడానికి కారణం మాత్రం సచిన్ టెండూల్కర్ అంటూ మరో బాంబు పేల్చాడు సెహ్వాగ్. అసలు ఏం జరిగిందంటే..
2002లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోని టీమిండియా నాట్‌వెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లింది. ఈ సిరీస్ చరిత్రలో నిలిచిపోయింది. అయితే.. ఈ సిరీస్ ఆరంభంలో శ్రీలంక-భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వీరేందర్ సెహ్వాగ్ సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. త్వరగా అవుటై పెవిలియన్ చేరాడు. సెహ్వాగ్ బాగా ఆడకుండా వెంటనే అవుట్ అవ్వడంతో ఆగ్రహంతో ఊగిపోతున్న అప్పటి టీమిండియా కోచ్ జాన్ రైట్ సెహ్వాగ్.. డ్రెస్సింగ్ రూమ్‌కు రాగానే.. అతని కాలర్ పట్టుకుని తోసేశాడంటా. దాంతో సెహ్వాగ్ కూర్చిలో పడిపోయాడు. ఆ తర్వాత కూడా అతను సెహ్వాగ్‌పై నోరు పారేసుకున్నాడు. ఈ ఘటనతో తనకు పట్టలేనంత కోపం వచ్చిందని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
ఒక విదేశీ కోచ్, తెల్లొడు మనపై ఇలా చేయి చేసుకోవడం ఏంటని అప్పుడే టీమ్‌లోని మిగతా సభ్యులను ప్రశ్నించాడంటా.. అయితే ఈ విషయం పెద్దది కాకుండా, బయటికి రాకుండా సచిన్ అందరి దగ్గర మాట తీసుకోవడంతో విషయం ఎవరికీ తెలియదని సెహ్వాగ్ అన్నాడు. కాగా.. నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్‌పై చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో మొహమ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ విరోచితంగా పోరాడి టీమిండియాను గెలిపించారు. టీమిండియా గెలిచిన వెంటనే టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ లార్డ్స్ బాల్కనీలో జెర్సీ విప్పి చేసిన సింహాగర్జన ఎప్పటికీ భారత క్రికెట్‌లో మరుపురాని ఘట్టం. మరి ఈ సిరీస్ సందర్భంగా జాన్ రైట్ సెహ్వాగ్‌పై చేయి చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
John Wright Pulled Me By My Collar: Virender Sehwag Makes Shocking Revealhttps://t.co/0KY1qPS85k pic.twitter.com/h8NhC4O7nO
— Times Now Sports (@timesnowsports) August 3, 2023
ఇదీ చదవండి: తిలక్ వర్మ బాగానే ఆడుతున్నాడు కానీ.. ఇదొక్కటే పెద్ద మైనస్!