iDreamPost

తిలక్‌ వర్మ బాగానే ఆడుతున్నాడు కానీ.. ఇదొక్కటే పెద్ద మైనస్‌!

  • Published Aug 04, 2023 | 7:27 PMUpdated Aug 04, 2023 | 7:27 PM
  • Published Aug 04, 2023 | 7:27 PMUpdated Aug 04, 2023 | 7:27 PM
తిలక్‌ వర్మ బాగానే ఆడుతున్నాడు కానీ.. ఇదొక్కటే పెద్ద మైనస్‌!

తెలుగు తేజం, టీమిండియా యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మ పేరు నిన్నటి నుంచి మారుమోగిపోతుంది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓటమి పాలైనా.. తిలక్‌ బ్యాటింగ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. హర్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, శుబ్‌మన్‌ గిల్‌ లాంటి వాళ్లు కూడా విఫలమైన చోట.. తొలి మ్యాచ్‌ ఆడుతున్న ఒత్తిడి ఏం మాత్రం లేకుండా చూడ చక్కటి షాట్లతో వెస్టిండీస్‌ బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. పైగా అతనే భారత ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌. కేవలం 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 39 పరుగులు చేసి రాణించాడు. పైగా ఆడిన తొలి మూడు బంతుల్లోనే రెండు భారీ సిక్సర్లు బాది.. అసలు సిసలైన టీ20 క్రికెటర్‌ అనిపించుకున్నాడు. కానీ.. బ్యాటింగ్‌ బాగానే చేస్తున్నా.. ఓ ప్రధాన సమస్యను అధిగమించాల్సిన అవసరం ఉందని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదేంటంటే.. ?

లాంగ్‌ ఇన్నింగ్స్‌ ఆడలేకపోవడం..!
తిలక్‌ వర్మలో అద్భుతమైన టాలెంట్‌ ఉంది. ఎలాంటి పిచ్‌పైనైనా.. ఎలాంటి బౌలర్‌నైనా ఎదుర్కొగలడు. అన్నింటికీ మించి భయం లేకుండా బ్యాటింగ్‌ చేయగల సత్తా తిలక్‌ సొంతం. అయితే.. తనకు దొరికిన సూపర్‌ స్టార్ట్‌ను తిలక్‌ లాంటి ఇన్నింగ్స్‌లా మలవలేకపోతున్నాడు. గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్‌ వర్మకు తొలి మూడు బంతుల్లోనే 12 రన్స్‌ వచ్చాయి. అది అద్భుతమైన స్టార్ట్‌. దాంతో అతనిపై తొలి మ్యాచ్‌ ఆడుతున్న ఒత్తిడి పూర్తిగా తొలగిపోయింది. ఆ తర్వాత కూడా సూపర్ షాట్లతో అలరించాడు. టీ20కి తగ్గ స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. కానీ.. ఎంత చిన్న ఫార్మాట్లలోనైనా భాగస్వామ్యాలు నిర్మించడం ఎంతో కీలకం. ఒక విధంగా చెప్పాలంటే అది ఆట బేసిక్‌ రూల్‌. అదే మ్యాచ్‌లను గెలిపిస్తుంది.

ఒక్క ఆటగాడే సింగిల్‌ హ్యాండ్‌తో మ్యాచ్‌ గెలిపించడం ప్రతిసారీ సాధ్యమయ్యే పని కాదు. అనేక సార్లు మంచి భాగస్వామ్యాలే మ్యాచ్‌లను గెలిపిస్తాయి. ఈ మ్యాచ్‌లోనూ తిలక్‌ వర్మ-సూర్యకుమార్‌ యాదవ్‌ మధ్య మంచి భాగస్వామ్య నిర్మితమైంది. అయితే.. ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ అవుట్‌ అయ్యాడు. 67 పరుగులు వద్ద టీమిండియా సూర్యకుమార్‌ యాదవ్‌ వికెట్‌ను కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తిలక్‌ వర్మ.. కాస్త ఓపిక చూపించి ఉండాల్సింది. తర్వాత వచ్చిన బ్యాటర్‌ క్రీజ్‌కు కొత్త కాబట్టి అతను కుదురుకునేంత వరకు కాస్త నెమ్మదిగా బ్యాటింగ్‌ చేస్తూ తన వికెట్‌ కావాడుకోవాల్సింది. కానీ, ఇక్కడ తిలక్‌ తప్పు చేశాడు. వేగంగా ఆడి వికెట్‌ సమర్పించుకున్నాడు.

దీంతో టీమిండియా వెంటవెంటనే సెటిల్‌ అయిన ఇద్దరు బ్యాటర్ల వికెట్లు కోల్పోవడంతో తర్వాత వచ్చిన బ్యాటర్లను వెస్టిండీస్‌ బౌలర్ల మరింత ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో టీమిండియా మ్యాచ్‌ ఓడిపోయింది. తిలక్‌ మరికొంత సేపు క్రీజ్‌ ఉండి ఉంటే.. తన హాఫ్‌ సెంచరీ పూర్తి అయ్యేది, టీమిండియాకు విజయం కూడా దక్కేది. ఎంత గొప్ప ఆటగాడైనా? టన్నుల కొద్ది టాలెంట్‌ ఉన్నా.. జట్టు పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్‌లో వేరియేషన్స్‌​ చూపించాలి. వేగంగా ఆడాల్సిన టైమ్‌లో వేగంగా ఆడాలి.. వికెట్లు పడుతున్న టైమ్‌ కాస్త తగ్గి పార్ట్నర్‌షిప్‌లు నిర్మించాలి. గుడ్డెద్దు చేనులో పడ్డట్లు ఆడితే.. అన్ని సార్లు సక్సెస్‌ అవ్వలేరని కొంతమంది క్రికెట్‌ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు.

చివరి వరకు ఆడి జట్టుకు విజయం అందించడంతో పాటు తను కూడా పెద్ద స్కోర్లు చేయడానికి ఆ నిలకడే ఉపయోగపడుతుంది. మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్లు తనని తాను మల్చుకోవడం తిలక్‌ ఎంత త్వరగా నేర్చుకుంటే అతనికీ మంచింది.. టీమిండియా కూడా మంచింది. పైగా తిలక్‌ వర్మ ఆడేది మిడిల్డార్‌ల కానుక.. మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ఎంతో ముఖ్యం. ఈ విషయంలో విరాట్‌ కోహ్లీ నుంచి తిలక్‌ ఇది నేర్చుకోవచ్చని క్రికెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పుడు తిలక్‌ వర్మ ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని.. కాస్త మెచ్యూరిటీ చూపించి, బ్యాటింగ్‌లో ఎక్సలేటర్‌ పెంచుతూ.. తగ్గిస్తూ ఆడితే.. అతనికి తిరుగుండదనే చెప్పాలి. ఈ ఒక్క​ సమస్యను అధిగమిస్తే ఇండియన్‌ క్రికెట్‌కు అతనే సూపర్‌స్టార్‌. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: టీమిండియా ఓటమి! కన్నీళ్లు పెట్టుకున్న కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి