iDreamPost

పాక్‌ సెమీస్‌ చేరొద్దనే కుట్రతో భారత్‌ వర్షాన్ని ఆపేసింది! రేయ్‌ ఎవర్రా మీరంతా?

  • Published Nov 09, 2023 | 6:07 PMUpdated Nov 09, 2023 | 6:07 PM

ఫేమస్‌ అవ్వడానికి చేస్తున్నాడో.. టీవీలో కనిపించేందుకు చేస్తున్నాడో కానీ ఓ పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ అర్థంలేని కామెంట్లు చేస్తూ నవ్వుల పాలవుతున్నాడు. ఇండియా బౌలర్లకు వేరే బాల్స్‌ ఇస్తున్నారంటూ ఆరోపణలు చేసిన వ్యక్తి.. ఇప్పుడు మరో హిలెరియస్‌ జోక్‌తో వార్తల్లో నిలిచాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఈ వరల్డ్‌ కప్‌లో టీమిండియా వేరే బాల్స్‌ ఉపయోగిస్తుందని, బాల్‌ స్వింగ్‌ అయ్యేందుకు ఏదో టెక్నాలజీ వాడుతున్నారని అర్థం లేని వ్యాఖ్యలు చేసి నవ్వులపాలైన పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ హసన్‌ రజా మరో భారీ జోక్‌ పేల్చాడు. సమీస్‌ బెర్తుల్లో నాలుగో ప్లేస్‌ ఒక్కటే మిగిలి ఉన్న విషయం తెలిసిందే. ఆ ఒక్క స్థానం కోసం న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ పోటీ పడుతున్నాయి. అయితే.. న్యూజిలాండ గురువారం శ్రీలంకతో కీలకమైన మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలిస్తే సెమీస్‌కు చేరే అవకాశం మరింత మెరుగు అవుతుంది. పాకిస్థాన్‌ అవకాశాలు సన్నగిల్లుతాయి. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లో లంక గెలవాలని పాక్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

ఒక వేళ న్యూజిలాండ్‌-శ్రీలంక మ్యాచ్‌ జరగపోయినా పాకిస్థాన్‌ ఫ్యాన్స్‌ హ్యాపీనే. ఎందుకంటే న్యూజిలాండ్‌కు ఒక్క పాయింటే వస్తుంది. కివీస్‌-లంక మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఆకాశం మేఘావృతం అయి ఉండటంతో వర్షం వచ్చే సూచనలు కనిపించాయి. దీంతో పాకిస్థాన్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. వర్షం రావాలని బలంగా కోరుకున్నారు. కానీ, వారికి నిరాశ కలిగిస్తూ.. మ్యాచ్‌ కొనసాగింది. దీంతో.. పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ రజా నవ్వుల పాలయ్యే వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను సెమీస్‌ చేరకుండా చేసేందుకు.. భారత్‌ ఏదో టెక్నాలజీ ఉపయోగించి.. బెంగళూరులో వర్షం పడకుండా ఆపేసిందంటూ అర్థం లేని కామెంట్‌ చేశారు.

ఇప్పటికే.. టీమిండియా బౌలర్లుకు వేరే బాల్స్‌ ఇస్తున్నారని, అందుకే ఎవరికీ స్వింగ్‌ లభించని పిచ్‌పై కూడా భారత బౌలర్లు స్వింగ్‌ రాబడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ కామెంట్‌ క్రికెట్‌ వర్గాల్లో వైరల్‌గా మారాయి. దీనిపై పాకిస్థాన్‌ మాజీ లెజెండరీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ స్పందిస్తూ.. అలా ఏం ఉండదని, అంపైర్లు, మ్యాచ్‌ రిఫరీలు ఉంటారని టాస్‌ తర్వాత కెప్టెన్లు బాల్స్‌ను ఎంపిక చేసుకుంరని రజాకు కౌంటర్‌ ఇచ్చారు. మీ పరువుతో పాటు మా పరువు కూడా తీయకండి అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత టీమిండియా స్టార్‌ బౌలర్‌ షమీ సైతం రజా వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సిగ్గుపడాలని ఘాటుగా బదులిచ్చాడు. అయినా కూడా రజా తీరులో మార్పు రావడం లేదు. మరి తాజాగా హసన్‌ రజా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి