iDreamPost
android-app
ios-app

Vinesh Phogat: వినేశ్‌ ఫొగాట్‌కు భారీ నజరానా ప్రకటించిన హర్యానా ప్రభుత్వం.. ఎన్ని కోట్లంటే!

  • Published Aug 08, 2024 | 11:11 AM Updated Updated Aug 08, 2024 | 11:11 AM

Haryana Reward- Vinesh Phogat: ఫైనల్‌ వరకు దూసుకెళ్లి.. స్వల్ప అధిక బరువు కారణంగా.. అనర్హత వేటు పడిన వినేశ్‌ ఫొగాట్‌కి హర్యానా ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమెను సత్కరిస్తామని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

Haryana Reward- Vinesh Phogat: ఫైనల్‌ వరకు దూసుకెళ్లి.. స్వల్ప అధిక బరువు కారణంగా.. అనర్హత వేటు పడిన వినేశ్‌ ఫొగాట్‌కి హర్యానా ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమెను సత్కరిస్తామని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

  • Published Aug 08, 2024 | 11:11 AMUpdated Aug 08, 2024 | 11:11 AM
Vinesh Phogat: వినేశ్‌ ఫొగాట్‌కు భారీ నజరానా ప్రకటించిన హర్యానా ప్రభుత్వం.. ఎన్ని కోట్లంటే!

పారిస్ ఒలింపిక్స్‌లో పతకం పక్కా సాధిస్తుంది అనుకున్న భారత మహిళా రెజ్లర్‌.. వినేశ్‌ ఫొగాట్‌పై ఫైనల్‌కు ముందు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. నిర్దేశించిన దాని కన్నా.. కాస్త ఎక్కువ అనగా 100 గ్రాముల బరువు అధికంగా ఉన్న కారణంగా ఆమెను ఫైనల్‌ నుంచి డిస్‌క్వాలిఫై చేశారు. ఈ నిర్ణయంతో దేశంలోని ప్రజలందరూ షాక్‌కు గురయ్యారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సహా.. ఇతర సెలబ్రిటీలు.. వినేశ్‌కు మద్దతుగా నిలిచారు. ధైర్యంగా ఉండమని.. భవిష్యత్తులో కచ్చితంగా విజయం సాధిస్తావని అంటున్నారు. ఇదిలా ఉండగానే వినేశ్‌ ఫొగాట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. గురువారం ఉదయం ఈ విషయాన్ని ఎక్స్‌ ద్వారా తెలిపారు. ఓవర్ వెయిట్ కారణంగా పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 ఫైనల్‌లో ఆడకుండా అనర్హత వేటు పడడంతో నిరుత్సాహానికి గురైన వినేష్.. రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పారు. ఇదిలా ఉండగా.. వినేశ్‌కు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.

ఫైనల్‌లో పాల్గొనకుండా అనర్హత వేటు పడినా సరే.. తమ దృష్టిలో వినేశ్‌ విజేతనే అని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఆమెని పతక విజేతగా స్వాగతిస్తామని, సత్కరిస్తామని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రకటించారు. ఒలింపిక్స్‌లో రజత పతక విజేతకు హర్యానా ప్రభుత్వం అందించే సన్మానాలు, రివార్డులు, సౌకర్యాలను వినేశ్‌ ఫొగాట్‌కు కూడా అందజేస్తామని ఈ సందర్భంగా హర్యానా ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. వినేశ్‌ ఛాంపియన్‌ అని సీఎం సైనీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Haryana government has announced a huge Nazarana for Vinesh Phogat

ఒలింపిక్స్‌, పారాఒలింపిక్స్‌లో పతకం సాధించిన క్రీడాకారులకు ఏ రాష్ట్రంలో లేని విధంగా హర్యానా ప్రభుత్వం భారీ నజరానాలు అందజేస్తుంది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధిస్తే.. ఆరు కోట్లు, రజతానికి 4 కోట్ల రూపాయలు, కాంస్య పతకం సాధించిన వారికి 2.5 ​కోట్ల రూపాయల నజరానా ప్రకటించింది. అలానే తృటిలో పతకం కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచిన వారికి కూడా 50 లక్షల రూపాయల ప్రోత్సాహకం అందిస్తోంది. అలానే ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన క్రీడాకారులకు ఏకంగా 15 లక్షల రూపాయలు అందిస్తోంది. దీని ప్రకారం చూసుకుంటే వినేశ్‌కు 4 కోట్ల రూపాయల నజరానా లభించనుంది.

ఫైనల్లో అనర్హత వేటు నేపథ్యంలో వినేశ్‌.. ఎక్స్‌లో భావోద్వేగా ట్వీట్‌ చేశారు‘కుస్తీ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను. మీ కల, నా ధైర్యం చెదిరిపోయాయి. ‘‘ఇక నాకు పోరాడే బలం లేదు. రెజ్లింగ్‌కు గుడ్‌బై (2001-2024). నేను మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. నన్ను క్షమించండి’’ అంటూ ఆవేదనాభరిత ట్వీట్‌ చేశారు. తన బరువు విభాగం (50కేజీ) కన్నా 100 గ్రాములు ఎక్కువగా ఉండటం వినేశ్‌ను నిరాశపరిచింది. ఎక్కువ బరువ వల్ల ఆమె అనర్హతకు గురైంది. ఆ 100 గ్రాములు తగ్గించుకోవడానికి మరికొంత సమయం ఇవ్వాలని అధికారులను ఎంత బతిమాలినా ఫలితం లేకుండాపోయింది. అయినా.. ఇప్పటికీ ఒలింపిక్‌ ఫైనల్‌ చేరిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది.