iDreamPost
android-app
ios-app

భారత కెప్టెన్‌కు భారీ జరిమానా విధించిన ఐసీసీ! 3 డీమెరిట్‌ పాయింట్లు కూడా..

  • Published Jul 24, 2023 | 7:39 AM Updated Updated Jul 24, 2023 | 7:39 AM
  • Published Jul 24, 2023 | 7:39 AMUpdated Jul 24, 2023 | 7:39 AM
భారత కెప్టెన్‌కు భారీ జరిమానా విధించిన ఐసీసీ! 3 డీమెరిట్‌ పాయింట్లు కూడా..

ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ బ్యాట్‌తో వికెట్లును కొట్టిన భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌కు ఐసీసీ భారీ ఫైన్‌ వేసింది. ఆమె మ్యాచ్‌ ఫీజులో 75 శాతం కోత విధించడమే కాకుండా.. మూడు డీమెరిట్‌ పాయింట్లను కూడా ఇచ్చినట్లు సమాచారం. మరో రెండేళ్లలో కౌర్‌ ఒక్క డీమెరిట్‌ పాయింట్‌ పొందినా.. ఒక టెస్టు లేదా మూడు వన్డేలు ఆడకుండా నిషేధం విధిస్తారు.

ఇంతకీ వివాదం ఏంటీ?
బంగ్లాదేశ్‌లో పర్యటించిన ఇండియన్‌ ఉమెన్స్‌ టీమ్‌ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడింది. టీ20 సిరీస్‌ను 2-1తో నెగ్గిన టీమిండియా వన్డే సిరీస్‌ను 1-1తో సరిపెట్టుకుంది. తొలి వన్డేలో బంగ్లాదేశ్‌ విజయం సాధించగా.. రెండో వన్టేలో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే.. సిరీస్‌ డిసైడింగ్‌ మ్యాచ్‌ అయినా మూడో వన్డేనే మొత్తం వివాదానికి కేంద్ర బిందువైంది.

ఈ మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌.. నహిదా అక్తర్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటై అయింది. కానీ అంపైర్‌ తప్పుడు నిర్ణయంతోనే తాను అవుటైనట్లు ఆగ్రహం తెచ్చుకున్న కౌర్‌.. వికెట్లను బ్యాటర్లగా కొట్టింది. అంతటితో ఆగకుండా బయటికి వెళ్తో అంపైర్‌ను ఏదో అంటూ వెళ్లింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ హర్మన్‌ మ్యాచ్‌ ఫీజులో కోత విధిస్తూ చర్యలు తీసుకుంది. దీనిపై బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ సైతం స్పందిస్తూ.. హర్మన్‌ మైదానంలో కాస్త మంచిగా ప్రవర్తించి ఉంటే బాగుడేందని పేర్కొంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs WI: సింగిల్‌ హ్యాండ్‌తో కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టిన రహానే