iDreamPost
android-app
ios-app

VIDEO: పాక్‌ బౌలర్‌ రౌఫ్‌ ఓవర్‌ యాక్షన్‌! ఇషాన్‌ ఔటైన తర్వాత..

  • Author Soma Sekhar Published - 08:07 PM, Sat - 2 September 23
  • Author Soma Sekhar Published - 08:07 PM, Sat - 2 September 23
VIDEO: పాక్‌ బౌలర్‌ రౌఫ్‌ ఓవర్‌ యాక్షన్‌! ఇషాన్‌ ఔటైన తర్వాత..

ఇండియా-పాక్ మ్యాచ్ అంటే.. మైదానంలో చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. ఇక ఈ యుద్ధాన్ని చూడ్డానికి ఇరుదేశాల ప్రేక్షకులతో పాటుగా వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. మరి ఇలాంటి హై ఓల్టేజ్ మ్యాచ్ లో ఆటగాళ్లు కవ్వింపులకు దిగితే.. ఇక అంతే సంగతులు. తాజాగా ఆసియా కప్ లో భాగంగా పాక్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ ను అవుట్ చేసిన తర్వాత పాక్ బౌలర్ హారీస్ రౌఫ్ ఓవరాక్షన్ చేశాడు. కష్టాల్లో ఉన్న టీమిండియాను తన అద్భుత బ్యాటింగ్ తో పటిష్ట స్థితిలో నిలిపాడు ఇషాన్ కిషన్. దీంతో అతడి వికెట్ తీసిన ఆనందంలో రౌఫ్ చేసిన ఓవరాక్షన్ పై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇషాన్ కిషన్.. 64 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాను 204/5 స్కోర్ వద్దకు తీసుకొచ్చాడు. తన అద్భుతమైన ఆటతీరుతో పాక్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ సెంచరీ వైపు సాగాడు. కానీ 82 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హారీస్ రౌఫ్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి బాబర్ చేతికి చిక్కాడు. దీంతో రౌఫ్ కాస్త ఓవరాక్షన్ చేశాడు. ఇషాన్ అవుట్ కావడంతో తన చేతి వేలును చూపిస్తూ.. వెళ్లిపో అన్నట్లుగా కోపంగా అరిచాడు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో.. టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ రౌఫ్ తీరుపై ఫైర్ అవుతున్నారు. ఏంటి రౌఫ్.. కోహ్లీ నీ బౌలింగ్ లో కొట్టిన సిక్సులు అప్పుడే మర్చిపోయావా? టీమిండియా బ్యాటర్లతో పెట్టుకోవద్దు.. అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా.. ఇండియా-పాక్ మ్యాచ్ అంటేనే సహజంగానే ఓ రేంజ్ క్రేజ్ ఉంటుంది. ఇక ఇలాంటి సంఘటనలు జరిగితే టీమిండియా ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఓ రేంజ్ లో రౌఫ్ ను ఆడేసుకుంటున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో ఇషాన్ కిషన్ (82), పాండ్యా (87) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. రోహిత్ (11), కోహ్లీ (4), గిల్ (10), అయ్యర్ (14), జడేజా (14) బుమ్రా (16) శార్దూల్ ఠాకూర్ (3) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ 4 వికెట్లతో సత్తా చాటగా.. నసీం షా, హారీస్ రౌఫ్ తలా 3 వికెట్లు పడగొట్టారు.