iDreamPost
android-app
ios-app

Hardik Pandya: ఆ సిరీస్‌కు పూర్తిగా దూరమైన హార్దిక్‌ పాండ్యా! మరి IPL..?

  • Published Dec 27, 2023 | 4:16 PM Updated Updated Dec 27, 2023 | 4:16 PM

హార్దిక్ పాండ్యా.. గత కొన్ని రోజులుగా ప్రపంచ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారాడు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆ వివరాల్లోకి వెళితే..

హార్దిక్ పాండ్యా.. గత కొన్ని రోజులుగా ప్రపంచ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారాడు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Hardik Pandya: ఆ సిరీస్‌కు పూర్తిగా దూరమైన హార్దిక్‌ పాండ్యా! మరి IPL..?

హార్దిక్ పాండ్యా.. గత కొన్ని రోజులుగా ప్రపంచ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారాడు. ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించి క్యాష్ ఆన్ ట్రేడ్ విధానం ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో అందరూ షాక్ కు గురైయ్యారు. అదీకాక పాండ్యాకు రాగానే కెప్టెన్సీ పగ్గాలు అందించింది ముంబై యాజమాన్యం. రోహిత్ శర్మను కాదని పాండ్యాకు పగ్గాలు అప్పగించడంతో.. ఇటు రోహిత్, అటు అతడి అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురైయ్యారు. ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా పాండ్యా గాయంపై వార్తలు వస్తున్నాయి. అతడు ఆఫ్గాన్ తో టీ20 సిరీస్ కు అందుబాటులో ఉంటాడా? లేడా? అన్న అనుమానాలను తీరిపోయాయి. మరి ఐపీఎల్ 2024 సంగతేంటి?

గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటూ వస్తున్నాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. దీంతో అతడు ఆఫ్గాన్ తో జనవరిలో జరిగే టీ20 సిరీస్ తో పాటుగా ఐపీఎల్ 2024కు అందుబాటులో ఉంటాడా? ఉండడా? అన్న సందేహాలు అందరిలో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాండ్యా ఇంకా పూర్తిగా గాయం నుంచి కోలుకోకపోవడంతో.. జనవరిలో ఆఫ్గాన్ తో జరిగే టీ20 సిరీస్ కు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని టీమిండియా మేనేజ్ మెంట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో అతడు ఐపీఎల్ కు అందుబాటులో ఉంటాడా? అన్న సందేహం ఫ్యాన్స్ లో మెుదలైంది.

కాగా.. ఆఫ్గాన్ సిరీస్ కు దూరం అయ్యిన పాండ్యా ఐపీఎల్ 2024 సీజన్ కు అందుబాటులో ఉంటాడని, అప్పటి వరకు అతడు పూర్తి ఫిట్ నెస్ లోకి వస్తాడని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ముంబై కెప్టెన్ గా ఎంపికైన తర్వాత బయటకి వచ్చిన పాండ్యాకు రోహిత్ ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. పాండ్యా ఎదురవగానే రోహిత్ ఫ్యాన్స్ ముంబైకా రాజా రోహిత్ శర్మ.. ముంబైకా రాజా రోహిత్ శర్మ అంటూ నినాదాలు చేశారు. దీంతో పాండ్యా అక్కడి నుంచి కామ్ గా వెళ్లిపోయాడు. మరి ఆఫ్గాన్ తో టీ20 సిరీస్ కు హార్దిక్ పాండ్యా దూరం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.