రెండు ఐపీఎల్ సీజన్లు గుజరాత్ జట్టును దిగ్విజయంగా నడిపించిన పాండ్యా.. సడెన్ గా సొంత గూటికి ఎందుకు వెళ్లాడు? గుజరాత్ యాజమాన్యంతో ఏమైనా గొడవలు ఉన్నాయా? ఇక టీమ్ ఛేంజ్ పై స్పందించిన అతడు టైటాన్స్ పేరెందుకు ఎత్తలేదు?
రెండు ఐపీఎల్ సీజన్లు గుజరాత్ జట్టును దిగ్విజయంగా నడిపించిన పాండ్యా.. సడెన్ గా సొంత గూటికి ఎందుకు వెళ్లాడు? గుజరాత్ యాజమాన్యంతో ఏమైనా గొడవలు ఉన్నాయా? ఇక టీమ్ ఛేంజ్ పై స్పందించిన అతడు టైటాన్స్ పేరెందుకు ఎత్తలేదు?
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే ఈ సీజన్ కు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటూ వస్తున్నాయి. ఇక ఆదివారం ప్లేయర్ల రీటైనింగ్ ప్రాసెస్ ముగిసింది. గత సీజన్ లో విఫలం అయిన ప్లేయర్లను వదులుకున్నాయి పలు ఫ్రాంచైజీలు. ఈ క్రమంలోనే క్యాష్ ట్రేడింగ్ పద్ధతి ద్వారా గుజరాత్ నుంచి ముంబై ఇండియన్స్ టీమ్ కు మారాడు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ప్రస్తుతం ఈ విషయమే ఐపీఎల్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే రెండు ఐపీఎల్ సీజన్లు గుజరాత్ జట్టును దిగ్విజయంగా నడిపించిన పాండ్యా.. సడెన్ గా సొంత గూటికి ఎందుకు వెళ్లాడు? గుజరాత్ యాజమాన్యంతో ఏమైనా గొడవలు ఉన్నాయా? ఇక టీమ్ ఛేంజ్ పై స్పందించిన అతడు టైటాన్స్ పేరెందుకు ఎత్తలేదు? ఈ ప్రశ్నలు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో రేకెత్తాయి.
గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి తన సొంత గూటికి చేరుకున్నాడు. ఐపీఎల్ 2024 మినీ వేలానికి ముందు జరిగిన క్యాష్ ట్రేడింగ్ విధానం ద్వారా పాండ్యా గుజరాత్ నుంచి ముంబైకి చేరాడు. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా.. టీమ్ మారడంపై తొలిసారి స్పందించాడు హార్దిక్. “నా సొంత టీమ్ ముంబై ఇండియన్స్ లోకి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ జట్టుతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. ముంబై, వాంఖడే, పల్టాన్ లాంటి ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి” అంటూ ట్వీట్ చేశాడు పాండ్యా. అయితే అతడు చేసిన ఈ పోస్ట్ లో గత రెండు ఐపీఎల్ సీజన్లకు కెప్టెన్ గా వ్యవహరించిన గుజరాత్ టైటాన్స్ టీమ్ పేరెత్తక పోవడం గమనార్హం. దీంతో ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
పాండ్యాకు టైటాన్స్ మేనేజ్ మెంట్ తో ఏమైనా గొడవలు జరిగాయేమో.. అందుకే అతడు టీమ్ మారాడు. లేకపోతే అద్భుతంగా రాణించే గుజరాత్ టీమ్ ను అతడు ఎందుకు వదిలేస్తాడు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా గుజరాత్ టైటాన్స్ టీమ్ డైరెక్టర్ మాట్లాడుతూ..”హార్దిక్ పాండ్యా తన సొంత ఫ్రాంచైజీకి వెళ్లాలని కోరికగా ఉందని మాతో చెప్పాడు. దీంతో మేము అతడి మాటను గౌరవించాం” అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. పాండ్యా టీమ్ ఛేంజ్ కు సంబంధించి అసలైన కారణాలు ఏవీ తెలియరావడం లేదు. మరి హార్దిక్ తన ట్వీట్ లో గుజరాత్ పేరెత్తక పోవడానికి కారణాలు ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This brings back so many wonderful memories. Mumbai. Wankhede. Paltan. Feels good to be back. 💙 #OneFamily @mipaltan pic.twitter.com/o4zTC5EPAC
— hardik pandya (@hardikpandya7) November 27, 2023
Gujarat Titans’ Director of cricket said, “Hardik Pandya expressed his desire to return to his original franchise. We respect his decision”. pic.twitter.com/tENVgyintc
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 27, 2023