Hardik Pandya: కెప్టెన్సీపై ఎట్టకేలకు స్పందించిన హార్దిక్ పాండ్యా! ఏమన్నాడంటే?

Hardik Pandya: కెప్టెన్సీపై ఎట్టకేలకు స్పందించిన హార్దిక్ పాండ్యా! ఏమన్నాడంటే?

టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ. దాంతో ఈ ఫార్మాట్ కు నెక్ట్స్ కెప్టెన్ ఎవరు? అంటూ ప్రశ్న బయలుదేరింది. ఇక అందరూ తదుపరి సారథి హార్దిక్ పాండ్యా అని ఫిక్స్ అయ్యారు. అయితే తాజాగా కెప్టెన్సీపై పాండ్యా స్పందించాడు.

టీ20 వరల్డ్ కప్ సాధించడంతో టీమిండియా ఆటగాళ్లతో పాటుగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తమ 13 ఏళ్ల ప్రపంచ కప్ కల నెరవేరిన వేళ ప్లేయర్ల సంతోషానికి ఆకాశమేహద్దుగా నిలిచింది. ఈ ఉద్విగ్న సమయంలో టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఈ ఇద్దరి దిగ్గజాల రిటైర్మెంట్ తో టీమిండియా ముందు ఓ పెద్ద ప్రశ్న ఎదురైంది. అదేంటంటే? పొట్టి ఫార్మాట్ కు నెక్ట్స్ కెప్టెన్ ఎవరు? ఈ ప్రశ్నకు చాలా మంది హార్దిక్ పాండ్యా అంటూ తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక కెప్టెన్సీపై తాజాగా హార్దిక్ పాండ్యా స్పందించాడు.

ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే రోహిత్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడంతో.. టీమిండియా తదుపరి సారథి ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యానే నెక్ట్స్ కెప్టెన్ అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇక ఈ ప్రశ్న హార్దిక్ పాండ్యాకు ఎదురైంది. కెప్టెన్సీపై పాండ్యా ఏమన్నాడంటే?

“కెప్టెన్సీపై నేను ఏమీ ఆలోచించడం లేదు. మేనేజ్ మెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిందే. పైగా 2026 టీ20 వరల్డ్ కప్ కు చాలా సమయం ఉంది. దాని గురించి ఆలోచించడం వేస్ట్. ఇక రోహిత్, కోహ్లీ ల పట్ల నేను సంతోషంగా ఉన్నాను. ఈ టైటిల్ గెలవడానికి వారు పూర్తిగా అర్హులు. ఇన్ని సంవత్సరాలుగా వారితో ప్రయాణం చేయడం ఎంతో అద్భుతంగా ఉంది. వారిని మిస్ అవుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. అయితే ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ప్లేయర్లను చూసుకుంటే.. కెప్టెన్ గా హార్దిక్ కు బుమ్రా నుంచి పోటీ ఎదురవుతుంది. మరి మేనేజ్ మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Show comments