వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్‌కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. ఇంజ్యురీతో బాధపడుతున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. హార్దిక్ పోయి అతడి ప్లేసులో యువ పేసర్ ప్రసిధ్ కృష్ణ వచ్చాడు. అయితే పాండ్యా స్థానంలో చోటు ఆశించిన ఒక ప్లేయర్‌కు భంగపాటు తప్పలేదు.
వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్‌కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. ఇంజ్యురీతో బాధపడుతున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. హార్దిక్ పోయి అతడి ప్లేసులో యువ పేసర్ ప్రసిధ్ కృష్ణ వచ్చాడు. అయితే పాండ్యా స్థానంలో చోటు ఆశించిన ఒక ప్లేయర్‌కు భంగపాటు తప్పలేదు.
వన్డే ప్రపంచ కప్-2023లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న భారత జట్టు.. లీగ్ దశలో మరో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. అందులో ఒకటి సౌతాఫ్రికాతో కాగా.. మరొకటి నెదర్లాండ్స్‌తో ఉంది. ఆల్రెడీ సెమీస్‌కు క్వాలిఫై అయినందున ఈ రెండు మ్యాచులు రోహిత్ సేనకు నామమాత్రం కానున్నాయి. అయితే విన్నింగ్ స్ట్రీక్‌ను కంటిన్యూ చేయాలంటే ఈ రెండింట్లోనూ నెగ్గాల్సి ఉంటుంది. అయితే సౌతాఫ్రికా, డచ్ టీమ్‌తో ఆడాల్సిన మ్యాచుల కంటే సెమీఫైనల్ మీదే భారత్ ఫోకస్ చేస్తోంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తేనే ఫైనల్ చేరుకుంటాం కాబట్టి కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్‌ల దృష్టి ఆ మ్యాచ్ మీదే ఉంది.
సెమీస్ కోసం వ్యూహాలు పన్నుతున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంజ్యురీ కారణంగా దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడ్డ హార్దిక్ ఇంకా కోలుకోలేదు. అతడి గాయం తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో ఎక్కువ కాలం రెస్ట్ ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ భావించిందట. ఇప్పట్లో కోలుకునే ఛాన్స్ లేకపోవడంతో వరల్డ్ కప్ నుంచి హార్దిక్‌ను పూర్తిగా తప్పించింది. అతడి ప్లేసులో యువ పేసర్ ప్రసిధ్ కృష్ణను రీప్లేస్ చేసింది. అయితే తనకు బదులు ప్రసిధ్‌ను తీసుకోవడంపై ఒక స్టార్ ప్లేయర్ అసంతృప్తితో ఉన్నట్లు టాక్. గాయపడిన హార్దిక్ ప్లేసులో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు చోటు దక్కలేదు.
అక్షర్ పటేల్‌కు బదులు ప్రసిధ్ కృష్ణను తీసుకున్నారు. దీంతో అక్షర్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న అక్షర్‌ను తీసుకోకపోవడం తప్పని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అక్షర్‌కు తిరుమల సెంటిమెంట్ కలసిరాలేదని అంటున్నారు. వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌తో కలసి రీసెంట్గా తిరుమలను విజిట్ చేశాడు అక్షర్. అయితే దైవదర్శనం తర్వాత టీమ్‌లోకి వస్తాడనుకుంటే.. అతడికి బదులు ప్రసిధ్‌కు ఛాన్స్ వచ్చింది. అయితే బీసీసీఐ నిర్ణయాన్ని కొందరు ఫ్యాన్స్ స్వాగతిస్తున్నారు. అశ్విన్, జడేజా రూపంలో ఆల్రెడీ స్పిన్ ఆల్‌రౌండర్లు ఉన్నారు కాబట్టి అక్షర్‌కు ఛాన్స్ ఇవ్వలేదని అంటున్నారు. మరి.. హార్దిక్ ప్లేసులో ప్రసిధ్‌ను తీసుకోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ICC టోర్నీల్లో భారత్‌కు శాపంగా మారిన గాయాలు.. హార్దిక్‌దే ఫస్ట్ కాదు..!
Hardik Pandya ruled out of the World Cup 2023.
– Prasidh Krishna replaces Hardik Pandya in the team. pic.twitter.com/HMOkdKojKL
— Johns. (@CricCrazyJohns) November 4, 2023
Rishabh Pant and Axar Patel visited the Lord Balaji temple. pic.twitter.com/1l8qAQG63T
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 3, 2023