Hardik Pandya: హార్దిక్ ఎక్కువ రోజులు క్రికెట్ ఆడలేడు.. అతడి వల్ల కాదు: మాజీ క్రికెటర్

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు సూపర్ ఫామ్​లో ఉన్నాడు. పొట్టి ప్రపంచ కప్​లో అదరగొట్టిన పాండ్యా.. ప్రస్తుతం జరుగుతున్న లంక సిరీస్​లోనూ దుమ్మురేపుతున్నాడు.

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు సూపర్ ఫామ్​లో ఉన్నాడు. పొట్టి ప్రపంచ కప్​లో అదరగొట్టిన పాండ్యా.. ప్రస్తుతం జరుగుతున్న లంక సిరీస్​లోనూ దుమ్మురేపుతున్నాడు.

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు సూపర్ ఫామ్​లో ఉన్నాడు. పొట్టి ప్రపంచ కప్​లో అదరగొట్టిన పాండ్యా.. ప్రస్తుత లంక సిరీస్​లోనూ దుమ్మురేపుతున్నాడు. ఈ సిరీస్​లోని తొలి టీ20లో అంతగా రాణించని పాండ్యా.. రెండో మ్యాచ్​లో మాత్రం చెలరేగిపోయాడు. 2 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్​ టైమ్​లో ఆఖర్లో వచ్చి 9 బంతుల్లో 22 పరుగులతో మ్యాచ్​ను ఫినిష్​ చేశాడు. చివరి టీ20లో కూడా ఇదే రీతిలో ఆడాలని అనుకుంటున్నాడు. సిరీస్ ముగిసిన తర్వాత ఫిట్​నెస్​పై మరింత ఫోకస్ పెట్టాలని భావిస్తున్నాడు పాండ్యా. వన్డేల్లో ప్లేస్ దక్కాలంటే ఫిట్​నెస్​ తప్పనిసరి అని టీమ్ మేనేజ్​మెంట్​ స్పష్టం చేయడంతో దానిపై దృష్టి సారిస్తున్నాడు.

వన్డే టీమ్​లో చోటు దక్కాలంటే దులీప్ ట్రోఫీలో ఆడి బౌలింగ్ ఫిట్​నెస్ నిరూపించుకోమని హార్దిక్​కు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది. కనీసం 8 ఓవర్లు బౌలింగ్ చేయగలిగితేనే టీమ్​లోకి తీసుకుంటామని ఇండికేషన్స్ పంపారట. అందుకే తన సత్తా చాటేందుకు అతడు నెట్స్​లో తీవ్రంగా శ్రమిస్తున్నాడని తెలుస్తోంది. ఈ తరుణంలో లెజెండరీ పేసర్ ఆశిష్ నెహ్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హార్దిక్ పనైపోయిందని.. అతడు ఇక ఆడలేడన్నాడు. పాండ్యా ఫిట్​గా లేడని, అతడు ఎక్కువ కాలం క్రికెట్ ఆడటం కష్టమేనని చెప్పాడు. కెరీర్​ను సుదీర్ఘ కాలం పొడిగించుకోవాలంటే హార్దిక్ తీవ్రంగా కష్టపడక తప్పదని.. లేకపోతే అంతే సంగతులు అని హెచ్చరించాడు నెహ్రా.

‘హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్​గా లేడు. అతడు ఎక్కువ కాలం క్రికెట్ ఆడలేడు. ప్రస్తుతం ఉన్న ఫిట్​నెస్​తో అతడు కేవలం టీ20ల్లో మాత్రమే ఆడగలడు. అందుకే అతడ్ని వన్డే టీమ్​లోకి తీసుకోలేదు. అయితే ఇండియా టీమ్ సెటప్​ నుంచి చూస్తే పాండ్యా ఎంతో కీలకమైన ఆటగాడు. ముఖ్యంగా వైట్​బాల్ క్రికెట్​లో అతడు జట్టులో ఉండటం చాలా తప్పనిసరి. ఇది జరగాలంటే పాండ్యా ముందు ఫిట్​నెస్​ ఇంప్రూవ్ చేసుకోవాలి’ అని నెహ్రా సూచించాడు. ఇక, హార్దిక్​తో కలసి గతంలో పని చేశాడు నెహ్రా. గుజరాత్ టైటాన్స్​కు పాండ్యా కెప్టెన్​గా ఉన్న టైమ్​లో కోచ్​గా ఉన్న నెహ్రాతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే హార్దిక్​ జీటీని వీడి ముంబైకి వెళ్లిపోయాడు. ఇప్పుడు నెహ్రా కూడా ఆ జట్టులో నుంచి బయటకు రావడం ఖాయమని వినిపిస్తోంది. మరి.. హార్దిక్ ఎక్కువ రోజులు ఆడలేడనే వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments