Nidhan
Gautam Gambhir: టీమిండియా నయా కోచ్ గౌతం గంభీర్ ఫస్ట్ అసైన్‌మెంట్‌లో సక్సెస్ అయ్యాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ సొంతం చేసుకోవడంతో అతడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.
Gautam Gambhir: టీమిండియా నయా కోచ్ గౌతం గంభీర్ ఫస్ట్ అసైన్‌మెంట్‌లో సక్సెస్ అయ్యాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ సొంతం చేసుకోవడంతో అతడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.
Nidhan
టీమిండియా నయా కోచ్ గౌతం గంభీర్ ఫస్ట్ అసైన్‌మెంట్‌లో సక్సెస్ అయ్యాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ సొంతం చేసుకోవడంతో అతడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. మూడు టీ20ల ఈ సిరీస్‌ను ఇంకో మ్యాచ్ ఉండగానే మెన్ ఇన్ బ్లూ పట్టేసింది. దీంతో తర్వాత జరిగే వన్డే సిరీస్‌ను కూడా ఇదే విధంగా గెలుచుకోవాలని భావిస్తున్నాడు కొత్త కోచ్ గంభీర్. అయితే ఈ సిరీస్‌కు ముందు ఓ విషయంలో అతడికి భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత కోచ్ రాహుల్ ద్రవిడ్ వల్లే కాలేదు.. నువ్వెంత అంటూ పలువురు బోర్డు పెద్దలు గౌతీని హెచ్చరించారని తెలుస్తోంది.
టీ20 సిరీస్‌లో జూనియర్లతో బాగానే కలసిపోయాడు కోచ్ గంభీర్. కానీ ఇక మీదట జరగబోయే సిరీస్‌ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సూపర్స్టార్లతో పాటు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి సీనియర్లను అతడు డీల్ చేయాల్సి ఉంటుంది. దూకుడు స్వభావం ఉన్న గౌతీ.. తన మాట వినకపోతే గొడవకు దిగుతాడేమోననే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ పెద్దలు అతడికి వార్నింగ్ ఇచ్చారని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ‘ఇదంత ఈజీ కాదు. ఫ్రాంచైజీ క్రికెట్లోలా ఇక్కడ నేనే బాస్‌ను.. నేనేం చెబితే అదే చేయాలి అంటే కుదరదు. మన టీమ్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం భిన్నంగా ఉంటుంది. ప్రతి ఆటగాడితో ఓపికగా మాట్లాడాలి. అవసరమైతే ఫోన్ చేయాలి’ అని గంభీర్‌కు బోర్డు నుంచి క్లియర్‌గా ఇన్స్ట్రక్షన్స్ వెళ్లాయని వినికిడి.
హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కొత్తలో లెజెండ్ ద్రవిడ్ కూడా ఇలాగే ఇబ్బంది పడ్డాడని.. అప్పటి నుంచి భారత క్రికెట్లో వేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. ఐపీఎల్లో ఆడటంతో పాటు యాడ్స్ రూపంలో ఆటగాళ్లంతా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారని.. టీమ్‌లోని కొందరు ఐపీఎల్లో కెప్టెన్లుగా కూడా పని చేస్తుండటంతో వాళ్లను సాఫ్ట్‌గా డీల్ చేయాలని గంభీర్‌కు సూచించిందట బీసీసీఐ.
అప్పట్లో కుంబ్లే కోచ్‌గా వచ్చిన కొత్తలో ఆటగాళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాడట. అందుకే అతడ్ని తీసేసి రవిశాస్త్రిని కోచ్ చేశారనే పుకార్లు వచ్చాయి. ఈ విషయాన్నీ తెలుసు కాబట్టి ద్రవిడ్ ప్లేయర్ల విషయంలో ఓపికగా ఉంటూ వచ్చాడని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అందుకే అతడి వల్లే కాలేదు, నువ్వెంత అంటూ గౌతీకి బోర్డు పెద్దలు హెచ్చరికలు జారీ చేశారని సమాచారం. మరి.. కోహ్లీ, రోహిత్ వంటి సూపర్స్టార్లతో గంభీర్ కలసిపోతాడా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.