Nidhan
పొట్టి కప్పులో టీమిండియా పెర్ఫార్మెన్స్పై స్పిన్ లెజెండ్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ కాదు.. భారత జట్టుకు ఇప్పుడు అతడే బిగ్ ప్లస్ అని అన్నాడు.
పొట్టి కప్పులో టీమిండియా పెర్ఫార్మెన్స్పై స్పిన్ లెజెండ్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ కాదు.. భారత జట్టుకు ఇప్పుడు అతడే బిగ్ ప్లస్ అని అన్నాడు.
Nidhan
టీ20 ప్రపంచ కప్-2024లో టీమిండియా అదరగొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్‌తో ప్రత్యర్థులను భయపెడుతోంది. గ్రూప్ స్టేజ్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ నెగ్గి సూపర్-8కు చేరుకుంది రోహిత్ సేన. నెక్స్ట్ స్టేజ్ మ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తోంది. సూపర్ పోరులో ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌ను చిత్తు చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ టీమ్స్‌ను ఓడించి సెమీస్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకోవాలని చూస్తోంది. అయితే ఇప్పటిదాకా అమెరికాలోని ట్రిక్కీ పిచ్‌లపై ఆడిన మెన్ ఇన్ బ్లూ.. ఇక మీదట కరీబియన్ దీవుల్లో ఆడనుంది. అక్కడి స్లో పిచ్‌ల మీద ఆడటం అలవాటైన ఆసీస్, ఆఫ్ఘాన్‌ను ఫేస్ చేయడం అంత ఈజీ కాదు. అందుకు సరికొత్త ప్రణాళికలతో రావాల్సి ఉంటుంది. బ్యాటింగ్ విభాగం మరింత ఊపందుకోవాలి.
టీమిండియా బౌలింగ్ యూనిట్ అద్భుతంగా రాణిస్తోంది. ఇదే ఫామ్‌ను విండీస్ పిచ్‌ల మీదా కంటిన్యూ చేస్తే భారత్‌ను ఆపడం ఏ టీమ్ వల్ల కూడా కాదు. జస్ప్రీత్ బుమ్రాతో పాటు హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ ఇదే జోరును కొనసాగించాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మెగా టోర్నీలో మెన్ ఇన్ బ్లూ ఆడుతున్న తీరు మీద అతడు హర్షం వ్యక్తం చేశాడు. టీమిండియా ఇలాగే ఆడాలని అన్నాడు. ఈ వరల్డ్ కప్‌లో భారత్‌కు బిగ్ ప్లస్ అంటే హార్దిక్ పాండ్యానే అంటూ ప్రశంసల జల్లులు కురిపించాడు. అలాంటోడే జట్టుకు కావాలని అన్నాడు. విరాట్ కోహ్లీ కంటే పాండ్యానే టీమ్‌కు కీలకమని.. అతడు రాణించడం ఎంతో అవసరమని చెప్పాడు.
‘ఈ ప్రపంచ కప్‌లో భారత్‌కు పెద్ద సానుకూల అంశం అంటే అది హార్దిక్ పాండ్యా బౌలింగ్ అనే చెప్పాలి. బాల్‌తో అతడు రాణిస్తున్న తీరు అద్భుతం. హయ్యెస్ట్ వికెట్ టేకర్స్ లిస్ట్‌లో అతడు నాలుగో స్థానంలో ఉన్నాడు. పాండ్యా బ్యాట్‌తో రాణిస్తాడని అంతా అనుకున్నారు. బౌలింగ్‌తో ఫర్వాలేదనేలా పెర్ఫార్మ్ చేసినా చాలని భావించారు. అతడిపై పెద్దగా అంచనాలు లేవు. కానీ అతడు బంతితో మ్యాజిక్ చేస్తున్నాడు. ఇలాంటోడే జట్టుకు కావాలి. హార్దిక్‌తో పాటు రిషబ్ పంత్ గురించి కూడా చెప్పాలి. రీఎంట్రీలో ఇంత బాగా ఆడటం మామూలు విషయం కాదు. రెగ్యులర్‌గా కోహ్లీ ఆడే మూడో నంబర్లో దిగుతూ అతడు మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడుతున్నాడు. ఆ స్పాట్లో సంజూ శాంసన్ ఆడతాడని అనుకుంటే ఆ ఛాన్స్‌ను పంత్ కొట్టేశాడు. పంత్ ఆ ప్లేస్‌లో ఆడటం వల్ల రైట్-లెఫ్ట్ కాంబో కూడా సెట్ అయింది’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు.
Harbhajan Singh “The biggest positive is that Hardik Pandya took the wicket. He was the fourth bowler in this tournament. But if you look at his wicket tally, he has done much better than what was expected of him.”pic.twitter.com/iNNOnYE4VM
— Sujeet Suman (@sujeetsuman1991) June 17, 2024