SNP
Hardik Pandya, BCCI: టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తాజాగా బీసీసీఐకి ఒక రిక్వెస్ట్ చేశాడు. ఓ సిరీస్ ఆడను అంటూ చెప్పాడు. మరి ఆ సిరీస్ ఏంటి? ఎందుకు ఆడను అంటున్నాడో ఇప్పుడు చూద్దాం..
Hardik Pandya, BCCI: టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తాజాగా బీసీసీఐకి ఒక రిక్వెస్ట్ చేశాడు. ఓ సిరీస్ ఆడను అంటూ చెప్పాడు. మరి ఆ సిరీస్ ఏంటి? ఎందుకు ఆడను అంటున్నాడో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా తాజాగా బీసీసీఐకి ఓ రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. అదేంటంటే.. ఆగస్టు 2 నుంచి శ్రీలంకతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. మొత్తం మూడు టీ20లు మూడు వన్డేలు ఆడేందుకు భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఆ సిరీస్‌కు తాను అందుబాటులో ఉండను, ఎంపిక సమయంలో తనను కన్సిడర్ చేయవద్దంటూ హార్ధిక్ పాండ్యా బీసీసీఐకి రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి పాండ్యా చేసిన రిక్వెస్ట్‌పై బీసీసీఐ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అయితే.. ఈ వన్డే సిరీస్ కంటే ముందు మూడు టీ20ల సిరీస్ ఆడనుంది భారత జట్టు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా రిటైర్మెంట్ ప్రకటించడంతో యంగ్ టీమిండియా శ్రీలంకతో టీ20 సిరీస్‌లో తలపడనుంది.
రోహిత్ రిటైర్మెంట్‌తో టీ20 జట్టుకు కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుతం టీ20 టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యానే రెగ్యులర్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే.. పాండ్యా మూడు టీ20ల సిరీస్ ఆడి.. వన్డే సిరీస్ నుంచి తప్పుకోనున్నాడు. తన వ్యక్తిగత కారణాల వల్ల వన్డే సిరీస్‌కు దూరంగా ఉంటున్నట్ల పాండ్యా బీసీసీఐకి వెల్లడించినట్లు సమాచారం. అయితే.. కొంతకాలంగా హార్ధిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి సంచలన విషయాలు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.
తన భార్య నటాషాతో పాండ్యా విడాకులు తీసుకుంటున్నాడని.. అందుకోసం తన ఆస్తిలో 70 శాతం నటాషా పేరిట కూడా మార్చినట్లు వార్తలు వచ్చాయి. వాటిపై పాండ్యా కానీ, నటాషా కానీ స్పందించలేదు. ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన తర్వాత కూడా నటాషా ఒక్క ట్వీట్ కూడా పాండ్యా గురించి చేయలేదు. టీమిండియా వరల్డ్ కప్ గెలవడంలో హార్ధిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. అయినా కూడా భార్య నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు క్రికెట్ అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. తాజాగా వన్డే సిరీస్ నుంచి వ్యక్తిగత కారణాలతో పాండ్యా తప్పుకోనుండటంతో.. భార్యతో విభేదాలను సెటిల్ చేసుకోవడానికే టీమిండియా నుంచి విరామం తీసుకుంటున్నాడంటూ క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
UPDATE 🚨
A look at the revised schedule for #TeamIndia‘s upcoming tour of Sri Lanka #SLvIND pic.twitter.com/HLoTTorOV7
— BCCI (@BCCI) July 13, 2024
Hardik Pandya has informed the BCCI that he won’t be part of the ODI squad against Sri Lanka due to personal reasons. (Express Sports). pic.twitter.com/eSNNGCvDBf
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 16, 2024