మాటిచ్చి దొంగదెబ్బ తీసిన పాండ్యా! మరీ ఇంత మోసమా?

టీమిండియా టీ20 కెప్టెన్‌ హార్డిక్‌ పాండ్యాపై విమర్శల వర్షానికి ఎడతెరిపిలేకుండా పోతుంది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడిపోవడంతో కెప్టెన్‌గా పాండ్యా వైఫల్యం చెందాడని, అతను తీసుకుంటున్న చెత్త నిర్ణయాలతోనే భారత్‌ ఓటమి పాలవుతుందని క్రికెట్‌ అభిమానులు మండిపడ్డారు. కానీ, మూడో టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించిన తర్వాత కూడా పాండ్యాపై విమర్శలు ఆగడం లేదు సరికదా.. మరింత పెరిగాయి. ఈ సారి భారత క్రికెట్‌ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం పాండ్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీమిండియా యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మని హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోనివ్వకుండా.. అతను 49 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఉన్న సమయంలో టీమిండియా విజయానికి 2 పరుగులు అవసరమైన సమయంలో పాండ్యా అనవసరంగా సిక్స్‌ కొట్టి.. మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడని, అదే సింగిల్‌ తీసి.. మ్యాచ్‌ ముగించే అవకాశం తిలక్‌ వర్మకు ఇచ్చి ఉంటే.. అతని హాఫ్‌ సెంచరీ పూర్తి అయ్యేదని, ఒక యువ క్రికెటర్‌కు హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకోవడం అనేది ఎంత ఆత్మవిశ్వసం పెంచుతుందో పాండ్యాకు తెలియదా? అంటూ క్రికెట్‌ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అలాగే గతంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోని, విరాట్‌ కోహ్లికి మ్యాచ్‌ ఫినిష్‌ చేసే అవకాశం ఇచ్చేందుకు.. ఎంతో సులువైన బంతిని కూడా కావాలిన డిఫెన్స్‌ ఆడిన వీడియోను షేర్‌ చేస్తూ పాండ్యాను ఏకిపారేస్తున్నారు.

అయితే.. ఆ షాట్‌ ఆడే కంటే ముందే హార్దిక్‌ పాండ్యా తిలక్‌ వర్మతో మాట్లాడిన ఆడియో టేప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తిలక్‌ వర్మ 47 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఉన్న సమయంలో పాండ్యా, తిలక్‌తో మాట్లాడుతూ.. ‘నువ్వు చివరి వరకు ఉండి, మ్యాచ్‌ను ముగించాలి, కంగారు పడకుండా జాగ్రత్తగా ఆడూ’ అంటూ ఓ పెద్దన్నలా, బాధ్యత గత కెప్టెన్‌లా తిలక్‌తో మాట్లాడాడు. తిలక్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోవాడానికే పాండ్యా అలా చెప్పాడని క్రికెట్‌ గురించి కనీస అవగాహన ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. కానీ, పాండ్యా మాత్రం తాను చెప్పిన మాటకు విరుద్ధంగా.. తిలక్‌ వర్మను హాఫ్‌ సెంచరీ చేయనియకుండా సిక్స్‌తో మ్యాచ్‌ ముగించాడు. దీంతో.. మాటిచ్చి మరీ తిలక్‌ను దారుణంగా దొంగదెబ్బ తీశాడని, వేగంగా ఆడిఉంటే తిలక్‌ ఎప్పుడో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకునే వాడని, అనవసరంగా పాండ్యా మాటలు విని నిదానంగా ఆడాడని, కానీ, పాండ్యా చివర్లో తిలక్‌ను మోసం చేశాడని క్రికెట్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సూర్య రిస్ట్‌ బ్యాండ్‌ సీక్రెట్‌ బయటపెట్టిన తిలక్‌! మిస్టర్ 360 రియాక్షన్‌ చూడండి..

Show comments