Hardik Pandya: ప్రాక్టీస్ సెషన్​లో అభిషేక్ నాయర్​తో హార్దిక్ గొడవ.. రెండో రోజే మొదలుపెట్టేశారు!

శ్రీలంకతో టీ20 సిరీస్​కు సిద్ధమవుతోంది టీమిండియా. కుర్రాళ్లతో కూడిన జట్టును కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుండి నడిపిస్తున్నాడు. అతడి సారథ్యంలో సిరీస్​ను క్లీన్​స్వీప్ చేయాలని డిసైడ్ అయింది మెన్ ఇన్ బ్లూ.

శ్రీలంకతో టీ20 సిరీస్​కు సిద్ధమవుతోంది టీమిండియా. కుర్రాళ్లతో కూడిన జట్టును కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుండి నడిపిస్తున్నాడు. అతడి సారథ్యంలో సిరీస్​ను క్లీన్​స్వీప్ చేయాలని డిసైడ్ అయింది మెన్ ఇన్ బ్లూ.

శ్రీలంకతో టీ20 సిరీస్​కు సిద్ధమవుతోంది టీమిండియా. కుర్రాళ్లతో కూడిన జట్టును సూర్యకుమార్ యాదవ్ నడిపిస్తున్నాడు. అతడి సారథ్యంలో సిరీస్​ను క్లీన్​స్వీప్ చేయాలని డిసైడ్ అయింది మెన్ ఇన్ బ్లూ. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్​ప్రీత్ బుమ్రా లేరు. రోకో జోడీతో పాటు జడ్డూ టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. బుమ్రాకు టీమ్ మేనేజ్​మెంట్ రెస్ట్ ఇచ్చింది. కాబట్టి పొట్టి ఫార్మాట్​లో భారత్​కు ఇది న్యూ జర్నీ అనే చెప్పాలి. నయా కెప్టెన్ సూర్యకుమార్​ యాదవ్​తో కలసి కొత్త కోచ్ గౌతం గంభీర్​ టీమ్​ను ఎలా నడిపిస్తాడు? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే లంక చేరుకున్న మెన్ ఇన్ బ్లూ ప్రాక్టీస్​లో బిజీ అయిపోయారు. అయితే ప్రాక్టీస్ రెండో రోజు అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

గంభీర్ పర్యవేక్షణలో తొలి రోజులాగే రెండో రోజు కూడా ఆటగాళ్లంతా ప్రాక్టీస్ సెషన్​లో చెమటోడ్చారు. జాగింగ్, రన్నింగ్ లాంటివి చేస్తూ ఫిట్​నెస్​ను పెంచుకోవడంపై ఫోకస్ చేశారు. అలాగే గౌతీతో పాటు ఇతర సహాయక కోచ్​ల సూచనలతో తమ బ్యాటింగ్, బౌలింగ్ స్కిల్స్​ను బెటర్​ చేసుకోవడంపై దృష్టి పెట్టారు. ఈ తరుణంలో అనూహ్యంగా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. ఒక బౌండరీ విషయంలో వీళ్లిద్దరూ ఫైట్​కు దిగారని క్రికెట్ వర్గాల సమాచారం. పాయింట్ దిశగా పాండ్యా కొట్టిన బంతిని ఫీల్డర్ అడ్డుకున్నాడట. అయినా అది ఫోర్ అని అతడు మొండికేశాడని తెలిసింది. హార్దిక్ బ్యాటింగ్ గురించి తెలిసిన అభిషేక్ కావాలనే బౌండరీ లైన్ వద్ద ఎక్స్​ట్రా ఫీల్డర్​ను మోహరించాడట.

పాండ్యా బ్యాట్ ఊపగానే ఆ ఫీల్డర్ వెళ్లి బంతిని అడ్డుకున్నాడట. అయినా అతడు మాత్రం అది బౌండరీకి వెళ్లిందంటూ నాయర్​తో గొడవకు దిగాడట. అది ఫోర్ కాదంటూ నాయర్ కూడా సీరియస్ అవడంతో ఏదో జరుగుతోందని అందరూ అక్కడికి చేరుకున్నారట. అయితే మిగిలిన ఆటగాళ్లు, టీమ్ మేనేజ్​మెంట్ జోక్యం చేసుకోవడంతో అది సద్దుమణిగిందని సమాచారం. మొదట గొడవలా మొదలైనా ఆఖరికి సద్దుమణిగి హార్దిక్-నాయర్ నవ్వుల్లో మునిగిపోవడంతో కథ ముగిసిందని వినికిడి. ఇది తెలిసిన నెటిజన్స్.. హార్దిక్ కెప్టెన్సీ దక్కలేదనే కోపంతో అగ్రెషన్ చూపిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడే మొదలుపెట్టారా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇవన్నీ మానేసి ఆటపై ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు. కాగా, ఫిట్​నెస్ ఇష్యూస్ కారణంగా చూపి పాండ్యాకు కాదని సూర్యకు కెప్టెన్సీ ఇవ్వడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.

Show comments