SNP
Rinku Singh, Suryakumar Yadav, IND vs SL: స్టార్ క్రికెటర్, ది ఫినిషర్ రింకూ సింగ్.. తాజాగా నూతన టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఒక రిక్వెస్ట్ చేశాడు. దాన్ని సూర్య కూడా ఓకే చేశాడు. ఇంతకీ ఆ రిక్వెస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Rinku Singh, Suryakumar Yadav, IND vs SL: స్టార్ క్రికెటర్, ది ఫినిషర్ రింకూ సింగ్.. తాజాగా నూతన టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఒక రిక్వెస్ట్ చేశాడు. దాన్ని సూర్య కూడా ఓకే చేశాడు. ఇంతకీ ఆ రిక్వెస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు యంగ్ టీమిండియా రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 22న భారత జట్టు శ్రీలంక వెళ్లింది. 27 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. అయితే.. ఈ సిరీస్ కోసం శ్రీలంకకు వెళ్తున్న సమయంలో.. కొత్త టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. యంగ్ క్రికెటర్ రింకూ సింగ్.. టీమ్‌లోని ఆటగాళ్లందరితో చాలా ఎంతో సన్నిహితంగా ఉంటూ వారిపై జోకులేస్తూ.. ఎప్పుడూ చాలా హుషారుగా ఉంటాడు.
తాజాగా శ్రీలంకకు వెళ్తున్న క్రమంలో కూడా సూర్యకుమార్ యాదవ్‌తో చాలా సరదాగా కనిపించిన రింకూ.. కొత్త బ్యాట్ కోసం సూర్యను రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో బ్యాట్ల కోసం టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ వెంటపడేవాడు రింకూ సింగ్. ఇప్పుడు బ్యాట్ కోసం సూర్యకుమార్ వెంటపడుతున్నాడంటూ క్రికెట్ అభిమానులు సరదాగా కామెంట్ చేస్తున్నాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. రింకూ సింగ్ చేసిన రిక్వెస్ట్‌ను సూర్య ఓకే చెప్పాడు. అది కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రింకూతో ఉన్న ఫొటోను పెడుతూ గాడ్స్ ప్లాన్, ‘ఠీక్ హై బ్యాట్ లే లేన’(సరే బ్యాట్ తీస్కో) అని పేర్కొన్నాడు.
సూర్య ఇన్‌స్టా స్టోరీని రింకూ రీ పోస్ట్ చేస్తూ.. దే దో భయ్యా బ్యాట్(ఇచ్చేయ్ అన్న బ్యాట్) అంటూ పేర్కొన్నాడు. గతంలో విరాట్ కోహ్లీ నుంచి బ్యాట్ తీసుకుని.. దాన్ని విరగొట్టి.. ఇంకో బ్యాట్ ఇవ్వాలంటూ కోహ్లీ వెంటబడ్డాడు రింకూ. ఇక శ్రీలంకతో టీ20 సిరీస్ విషయానికి వస్తే.. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌లు కూడా పల్లెకలె స్టేడియంలోనే జరుగనున్నాయి. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ కూడా జరగనుంది. వన్డేకు రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగనుంది. మరి సూర్య, రింకూ మధ్య జరిగిన ఈ ఫన్నీ కన్వర్జేషన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
rinku singh and suryakumar yadav insta stories #RinkuSingh #suryakunaryadav pic.twitter.com/wZPT3Sud8N
— Sayyad Nag Pasha (@nag_pasha) July 24, 2024