Nidhan
Harbhajan Singh, Team India, Spin-Friendly Pitches: టీమిండియా మేనేజ్మెంట్పై వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సీరియస్ అయ్యాడు. ఇది కరెక్ట్ కాదని.. చాన్నాళ్లుగా చేస్తున్న తప్పును ఇకనైనా సరిదిద్దుకోవాలన్నాడు. బ్యాటర్ల కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తున్నారని ఫైర్ అయ్యాడు.
Harbhajan Singh, Team India, Spin-Friendly Pitches: టీమిండియా మేనేజ్మెంట్పై వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సీరియస్ అయ్యాడు. ఇది కరెక్ట్ కాదని.. చాన్నాళ్లుగా చేస్తున్న తప్పును ఇకనైనా సరిదిద్దుకోవాలన్నాడు. బ్యాటర్ల కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తున్నారని ఫైర్ అయ్యాడు.
Nidhan
టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్ని విషయాల్లో నిక్కచ్చిగా ఉంటాడు. తన అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెప్పేస్తాడు. దేనికీ తొణకకుండా మాట్లాడే హర్భజన్.. ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాడు. అందుకే అతడ్ని ఫ్యాన్స్ మరింతగా ఇష్టపడతారు. తాజాగా మరో అంశం గురించి టర్బనేటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా మేనేజ్మెంట్ మీద అతడు సీరియస్ అయ్యాడు. పెద్ద తప్పు చేస్తున్నారని.. ఇదే రిపీట్ అయితే బ్యాటర్లకు కష్టమేనని అన్నాడు. భారత బ్యాట్స్‌మెన్ కాన్ఫిడెన్స్ దెబ్బతిన్నదని.. దీనికి టీమ్ మేనేజ్మెంటే కారణమంటూ ఫైర్ అయ్యాడు భజ్జీ. ఇకనైనా మేల్కొనకపోతే మరిన్ని సమస్యలు తప్పవంటూ హెచ్చరించాడు. హర్భజన్ ఎందుకు సీరియస్ అయ్యాడు? టీమ్ మేనేజ్మెంట్ చేస్తున్న తప్పేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
స్వదేశంలో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు ఫ్లాట్ పిచ్‌లను తయారు చేయిస్తున్న టీమిండియా మేనేజ్మెంట్.. టెస్టులకు పూర్తిగా స్పిన్ ఫ్రెండ్లీ వికెట్లను రెడీ చేయిస్తోంది. దీని వల్ల టెస్టు మ్యాచులు 2 నుంచి 3 రోజుల్లోనే ముగుస్తున్నాయి. బాల్ విపరీతంగా టర్న్ అవుతుండటంతో బౌలర్లు పండుగ చేసుకుంటున్నారు. కానీ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యర్థి ఆటగాళ్లే కాదు.. స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఆరితేరిన టీమిండియా బ్యాటర్లు కూడా దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. ఒకరిద్దరు తప్పితే ఎవరూ పెద్దగా పరుగులు చేయడం లేదు. స్పిన్నర్లు చెలరేగి అపోజిషన్ టీమ్స్‌ను తక్కువ స్కోర్లకు కుప్పకూల్చడంతో భారత్ ఈజీగా గెలుస్తోంది. వరుస విజయాలతో మన బ్యాటర్ల ఫెయిల్యూర్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదే విషయంపై హర్భజన్ రియాక్ట్ అయ్యాడు. మన బ్యాటర్ల దారుణ స్థితికి టీమ్ మేనేజ్మెంట్ కారణమన్నాడు.
‘భారత జట్టు స్వదేశంలో ఈ మధ్య పూర్తిగా టర్నింగ్ పిచెస్ మీద ఆడుతోంది. మ్యాచులు గెలవాలనే తపనతో స్పిన్ ఫ్రెండ్లీ వికెట్లను సిద్ధం చేస్తున్నారు. మన టీమ్ మ్యాచ్‌లు నెగ్గింది కూడా. కానీ చాలా మటుకు మ్యాచ్‌లు రెండు, మూడ్రోజుల్లోనే ముగుస్తున్నాయి. ఇది సరికాదు. నార్మల్ పిచ్‌లను తయారు చేయాలి. 3వ రోజు లేదా 4వ రోజు నుంచి బాల్ టర్న్ అవ్వాలి. ఇలాంటి పిచెస్ మీద ఆడినా భారత్ ఈజీగా గెలుస్తుంది. దీని వల్ల క్రీజులో సెటిల్ అయ్యేందుకు, స్పిన్‌ను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు బ్యాటర్లకు టైమ్ దొరుకుతుంది. మన టీమ్ మేనేజ్మెంట్ స్పిన్ ఫ్రెండ్లీ వికెట్లు తయారు చేయించి సొంత బ్యాటర్ల కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీసింది. ఇలాంటి పిచెస్పై ఎవరైనా ఔట్ అవుతారు.. తాము కూడా అంతే అనే భ్రమల్లోకి వారిని నెట్టేశాం. ఇందులో మార్పు రావాలి. గుడ్ పిచెస్ను రెడీ చేయాలి. టీమిండియాకు ఉన్న పేస్, స్పిన్ బలానికి ఓడించడం ఏ జట్టు వల్లా కాదు. స్పిన్ వికెట్ల వల్ల మన బ్యాటర్లు టర్న్ అయ్యే బాల్స్‌ను ఎలా ఆడాలో మర్చిపోయారు’ అని భజ్జీ దుయ్యబట్టాడు. మరి.. స్పిన్ వికెట్లు వద్దంటూ హర్భజన్ ఇచ్చిన సజెషన్పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.