iDreamPost
android-app
ios-app

రిటైర్‌ అయ్యేలోపు కోహ్లీ, రోహిత్‌ పాకిస్థాన్‌కు రావాలి: కమ్రాన్‌ అక్మల్‌

  • Published Aug 31, 2024 | 7:19 PM Updated Updated Aug 31, 2024 | 7:19 PM

Kamran Akmal, Virat Kohli, Rohit Sharma, Champions Trophy 2025: విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ రిటైర్‌ అయ్యేలోపు చేయాల్సిన ఒక్కపని ఇదే అంటూ ఓ పాక్‌ మాజీ క్రికెటర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Kamran Akmal, Virat Kohli, Rohit Sharma, Champions Trophy 2025: విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ రిటైర్‌ అయ్యేలోపు చేయాల్సిన ఒక్కపని ఇదే అంటూ ఓ పాక్‌ మాజీ క్రికెటర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 31, 2024 | 7:19 PMUpdated Aug 31, 2024 | 7:19 PM
రిటైర్‌ అయ్యేలోపు కోహ్లీ, రోహిత్‌ పాకిస్థాన్‌కు రావాలి: కమ్రాన్‌ అక్మల్‌

టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ.. రిటైర్మెంట్‌ ప్రకటించేలోపు ఆ ఒక్క పని చేయాలంటూ పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ కమ్రాన్‌ అక్మల్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. తాము ఇప్పట్లో రిటైర్‌ అవ్వడం లేదని.. ఇప్పటికే విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ పరోక్షంగా వెల్లడించిన విషయం తెలిసిందే. తాము ఇంకా కొన్నేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతామని చెప్పడంతో ఆ లోపు తమ దేశానికి వచ్చి క్రికెట్‌ ఆడాలని అక్మల్‌ కోరాడు. వచ్చే ఏడాది అంటే.. 2025 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌ వేదికగా జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడాలని అక్మల్‌ రిక్వెస్ట్‌ చేస్తున్నాడు.

విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ చాలా గొప్ప ప్లేయర్లు, ప్రపంచ వ్యాప్తంగా వారి చాలా మంది అభిమానులు ఉన్నారు.. వారి కెరీర్‌ మరింత సంపూర్ణ అవ్వాలంటే ఒక్కసారి పాకిస్థాన్‌కు కూడా వచ్చి ఆడాలని అన్నాడు అక్మల్‌. అయితే.. ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు రావాలని.. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు, పాక్‌ మాజీ క్రికెటర్లు, ఆ దేశ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. కానీ, రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడం, భారత జట్టు భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్థాన్‌కు పంపేందుకు బీసీసీఐ సుముఖంగా లేదు.

ఇదే విషయాన్ని ఇప్పటికే ఐసీసీకి కూడా వివరించింది. ఛాంపియన్స్‌ ట్రోఫీని ‘హైబ్రిడ్‌ మోడల్‌’లో నిర్వహించాలని కూడా కోరింది. టీమిండియా ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని ఐసీసీని బీసీసీఐ కోరింది. అందుకే బడ్జెట్‌ కూడా ఐసీసీ కేటాయించింది. కానీ, పాకిస్థాన్‌ మాత్రం ఛాంపియన్స్‌ ట్రోఫీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు అస్సలు ఒప్పుకోవడం లేదు. ఒక వేళ టీమిండియా పాకిస్థాన్‌ రాకుంటే.. తాము కూడా ఇండియాకు ఐసీసీ ఈవెంట్స్‌ కోసం వెళ్లమంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతోంది. మరి ఈ క్రమంలో.. కమ్రాన్‌ అక్మల్‌ విరాట్‌ కోహ్లీ గురించి ఇలాంటి కామెంట్స్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.