SNP
SNP
‘ప్రపంచంలో యాడా దొరకని సరుకు మనకాడ ఉందన్న..’ అంటూ పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ ఎర్ర చందనం గురించి వివరించే సీన్ గుర్తుండే ఉంటుంది. అలానే భారత జట్టులో ఉన్న క్రికెటర్ లాంటి ప్లేయర్ ప్రపంచంలో మరే జట్టులోనూ లేడని టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అంటున్నాడు. ఎర్ర చందనం లాంటి అతివిలువైన ఆ ఆటగాడు ఎవరో కాదు, మన మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. టీ20 ఫార్మాట్‌లో వరల్డ్ నంబర్ వన్‌గా ఉన్న సూర్య భాయ్‌ని.. వన్డేల్లోనూ ఆడించి.. వరల్డ్ కప్‌లో కీ ప్లేయర్‌గా వాడుకోవాలని.. భారత్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ.. సూర్యకు భారీగా అవకాశాలు ఇచ్చారు.
కానీ, సూర్య ఆరంభంలో అంతగా రాణించలేదు. దీంతో అతను వన్డేలకు పనికిరాడనే విమర్శలు కూడా వినిపించాయి. వరల్డ్ కప్‌కు ఎంపిక చేయడాన్ని కూడా చాలా మంది వ్యతిరేకించారు. కానీ, సూర్యపై పూర్తి నమ్మకం పెట్టుకున్నారు రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో సూర్య భాయ్ దుమ్మురేపుతున్నాడు. తొలి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి అసలు సిసలైన వన్డే ఇన్నింగ్స్ ఆడి, హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
రెండో వన్డేలో అయితే.. ఫినిషర్ రోల్ పోషిస్తూ.. తనలోని టీ20 బ్యాటర్‌ను బయటికి తెచ్చి టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు. రెండో వన్డేలో కేవలం 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో సునామీ ఇన్నింగ్స్ ఆడి 72 పరుగులు చేసి అదరగొట్టాడు. వరుసగా రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలో మంచి మార్కులు కొట్టేసి.. వరల్డ్ కప్‌కు ముందు ఆత్మవిశ్వాసం సంపాదించుకున్నాడు. ఇదే విషయాన్ని హర్భజన్ ప్రస్తావిస్తూ.. సూర్య లాంటి ప్లేయర్‌ను తక్కువ అంచనా వేయకూడదని, వరల్డ్ కప్‌లోని ప్రతి మ్యాచ్‌లో సూర్యను ఆడించాలని అన్నాడు. ఎందుకంటే.. సూర్య సెట్ అయితే ఎలాంటి మ్యాచ్‌నైనా మనవైపు తిప్పేస్తాడని, సూర్యలాంటి ప్లేయర్ మరే టీమ్‌లో కూడా లేడని అన్నాడు. తనదైన రోజున సూర్య టీమిండియాకు ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపిస్తాడని పేర్కొన్నాడు. మరి సూర్య గురించి, హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Harbhajan Singh’s opinion on SKY:
He deserves to feature in every World Cup match. 👀Agree with Harbhajan Singh?#SuryakumarYadav #HarbhajanSingh #CricketTwitter pic.twitter.com/eyE3cDwFOd
— Sportz Point (@sportz_point) September 26, 2023
ఇదీ చదవండి: యువరాజ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును బ్రేక్ చేసిన నేపాల్ బ్యాటర్!