iDreamPost

యువరాజ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును బ్రేక్ చేసిన నేపాల్ బ్యాటర్!

  • Author singhj Updated - 10:18 AM, Wed - 27 September 23
  • Author singhj Updated - 10:18 AM, Wed - 27 September 23
యువరాజ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును బ్రేక్ చేసిన నేపాల్ బ్యాటర్!

యువరాజ్ సింగ్.. క్రికెట్ లవర్స్​కు పరిచయం అక్కర్లేని పేరిది. భారత జట్టు సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ అతను. ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వన్డే వరల్డ్ కప్​తో పాటు టీ20 ప్రపంచ కప్​ను టీమిండియా అందుకోవడంలో యువీ పాత్రను ఎవరూ అంత సులువుగా మర్చిపోలేరు. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్​లలో భారత్ విశ్వవిజేతగా నిలవడంలో ఈ లెఫ్టాండర్​ది మెయిన్ రోల్ అని చెప్పొచ్చు. ఆ రెండు వరల్డ్ కప్స్​లోనూ బౌలర్​గా, బ్యాట్స్​మన్​గా, ఫీల్డర్​గా అద్భుతంగా రాణించాడు యువీ. బ్యాటుతో, బంతితో ప్రత్యర్థి జట్లకు చెమటలు పట్టించాడు.

2011 వన్డే వరల్డ్ కప్​లోనైతే క్యాన్సర్​ ఒకవైపు బాధిస్తున్నా ఓర్చుకొని జట్టు గెలుపు కోసం పోరాడాడు యువరాజ్. రెండు దశాబ్దాల పాటు భారత్​కు సేవలు అందించిన ఈ లెజెండరీ ప్లేయర్ 2019లో ఇంటర్నేషనల్ క్రికెట్​కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. యువీ సుదీర్ఘ కెరీర్​లో ఎన్నో అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అందులో ఒకటి 2007 టీ20 వరల్డ్ కప్​లో ఇంగ్లండ్​పై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. ఆ మ్యాచ్​ 16 బంతుల్లోనే యువీ 58 రన్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. అతడు 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టింది ఈ మ్యాచ్​లోనే. భారత్ నెగ్గిన ఈ మ్యాచ్​లో యువరాజ్​ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు ఇప్పటిదాకా యువరాజ్ పేరు పైనే ఉంది. అయితే ఎట్టకేలకు ఈ రికార్డును ఓ క్రికెటర్ బ్రేక్ చేశాడు. అతడే దీపేంద్ర సింగ్ ఐరీ. ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాతో జరుగుతున్న మ్యాచ్​లో నేపాల్ బ్యాట్స్​మన్ దీపేంద్ర 9 బంతుల్లోనే 50 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్​లో మొత్తంగా 10 బంతులు ఆడిన దీపేంద్ర 52 రన్స్ చేశాడు. అతడు ఏకంగా 8 సిక్సులు బాదడం విశేషం. దీపేంద్రతో పాటు కుషాల్ మల్లా (137) సెంచరీతో విజృంభించడంతో నేపాల్ 314 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనకు దిగిన మంగోలియా కేవలం 41 పరుగులకే కుప్పకూలింది. దీంతో నేపాల్‌ జట్టు టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టిస్తూ.. ఏకంగా 273 పరుగుల భారీ తేడా అతి పెద్ద విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు చూస్తే.. 9 బంతుల్లో హాఫ్‌ సెంచరీ, 34 బంతుల్లో సెంచరీ, వరుసగా 6 సిక్సులు, టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధిక స్కోరు, టీ20 ఫార్మాట్‌లో భారీ విజయం నమోదు అయ్యాయి.  మరి ఈ మ్యాచ్‌లో నేపాల్‌ బ్యాటర్ల విధ్వంసం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మూడో వన్డే కోసం లోకల్ ప్లేయర్లను దింపుతున్న భారత్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి