iDreamPost
android-app
ios-app

IPL 2024: నేను అక్కడ ఉంటే.. అతడి చెంప పగలకొట్టేవాడిని: హర్భజన్ సింగ్

  • Published Apr 13, 2024 | 10:00 PM Updated Updated Apr 13, 2024 | 10:00 PM

టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఓ స్టార్ ప్లేయర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడు చేసిన పనికి నేను అక్కడే ఉంటే.. అతడి చెంప పగలగొట్టేవాడినని షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు? ఏం చేశాడు? ఆ వివరాలు..

టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఓ స్టార్ ప్లేయర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడు చేసిన పనికి నేను అక్కడే ఉంటే.. అతడి చెంప పగలగొట్టేవాడినని షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు? ఏం చేశాడు? ఆ వివరాలు..

IPL 2024: నేను అక్కడ ఉంటే.. అతడి చెంప పగలకొట్టేవాడిని: హర్భజన్ సింగ్

ఈ ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. టోర్నీ సాగుతున్న తీరును చూస్తే.. చివరి దశకు వచ్చేసరికి ఇంకా ఆసక్తికరంగా మరడం ఖాయంగా అనిపిస్తోంది. ఇక వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో ఓ విజయం వచ్చి చేరిన విషయం తెలిసిందే. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ ప్లేయర్ ఓ చెత్త షాట్ ఆడి ఔట్ అయ్యాడు. దీంతో కామెంట్రీ చెబుతున్న టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ కు చిర్రెత్తుకొచ్చిందట. నేను అక్కడే ఉంటే అతడి చెంప పగలకొట్టేవాడిని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఈ ఐపీఎల్ సీజన్ లో భాగంగా ఇటీవల లక్నో వర్సెస్ ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ పోరులో ఢిల్లీ స్టార్ ప్లేయర్ పృథ్వీషా మెరుపువేగంతో పరుగులు చేశాడు. షా 22 బంతుల్లోనే 6 ఫోర్లతో 32 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ పవర్ ప్లేలోనే 60 పరుగులు చేసి.. విజయం ఖాయం చేసుకుంది. అయితే ఇలాంటి టైమ్ లో పృథ్వీ షా రవి బిష్ణోయ్ బౌలింగ్ లో చెత్త షాట్ ఆడి.. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఫైర్ అయ్యాడు. అతడి షాట్ సెలక్షన్ తప్పని విమర్శలు గుప్పించాడు.

“పృథ్వీ షా ఏం చేస్తున్నాడో అతడికి అర్ధం అవుతుందా? అసలు ఆ షాట్ ఆడాల్సిన అవసరమే లేదు. నిర్లక్ష్యపు షాట్ తో టీమ్ ను ఇబ్బంది పెట్టాడు. అతడు చెత్త షాట్లను ఆడటం అలవాటు చేసుకున్నాడు. నేను కనక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉండి ఉంటే.. షాను చెంప చెల్లుమనిపించేవాడిని. అతడి షాట్ సెలక్షన్, ప్రవర్తన మార్చుకోవాలి. లేదంటే జట్టుకు, అతడి కెరీర్ కు తీవ్ర నష్టం కలుగుతుంది” అని భజ్జీ చెప్పుకొచ్చాడు.