iDreamPost

Rohit Sharma: రోహిత్ గుండె బద్ధలైంది.. CSKకి ఆడటం పక్కా: ఇంగ్లండ్ దిగ్గజం

రోహిత్ ను అనూహ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించడంతో.. అతడి గుండె బద్ధలైందని, దీంతో అతడు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు వెళ్లి.. కెప్టెన్ పగ్గాలు చేపట్టడం పక్కా అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ బాంబ్ పేల్చాడు.

రోహిత్ ను అనూహ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించడంతో.. అతడి గుండె బద్ధలైందని, దీంతో అతడు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు వెళ్లి.. కెప్టెన్ పగ్గాలు చేపట్టడం పక్కా అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ బాంబ్ పేల్చాడు.

Rohit Sharma: రోహిత్ గుండె బద్ధలైంది.. CSKకి ఆడటం పక్కా: ఇంగ్లండ్ దిగ్గజం

టీమిండియా కెప్టెన్, ముంబై మాజీ సారథి రోహిత్ శర్మ ఆ జట్టును వీడిపోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక అతడి కోసం లక్నో, ఢిల్లీ ఫ్రాంచైజీలు కాచుకు కూర్చున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆ యాజమాన్యాలే తెలిపాయి. రోహిత్ ను దారుణంగా కెప్టెన్సీ నుంచి తీసేయడంతో.. అతడి గుండె బద్ధలైంది. దీంతో వేరే ఫ్రాంచైజీకి వెళ్లాలని రోహిత్ భావిస్తున్నట్లు, ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు బోలెడు వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయంపై మాజీ క్రికెటర్లు తమతమ అభిప్రాయాలను కూడా వెల్లడించారు. తాజాగా ఇంగ్లండ్ దిగ్గజం రోహిత్ CSKకి ఆడటం పక్కా అంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు.

హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా నియమిస్తూ.. ముంబై యాజమాన్యం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో రోహిత్ శర్మ మనసు బద్దలైంది. దీంతో వేరే ఫ్రాంచైజీ వైపు వెళ్లడానికి హిట్ మ్యాన్ ప్రయత్నాలు చేస్తున్నాడని కుప్పలు తెప్పలుగా వార్తలు వచ్చాయి. ఇక రోహిత్ తో పాటుగా సూర్యకుమార్, తిలక్ వర్మ, బుమ్రాలతో పాటుగా మరికొంతమంది ప్లేయర్లు సైతం ఇదే బాటలో ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇది ఫ్రాంచైజీ క్రికెట్ కావడంతో.. యాజమాన్య నిబంధనలకు లోబడే ఉండాలి. దీంతో రోహిత్ సైలెంట్ గా ఉన్నాడని అంటున్నారు. పైగా రిటెన్షన్ ప్రక్రియ ముగియడం, అప్పటికే వేలం పూర్తి అవ్వడంతో హిట్ మ్యాన్ చేసేది ఏమీ లేకపోయింది. దీంతో ఈ సీజన్ వరకు రోహిత్ ముంబై ఇండియన్స్ కే ఆడతాడు. కానీ వచ్చే సీజన్ 2025లో మాత్రం అతడు కచ్చితంగా టీమ్ మారతాడని అందరూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఇంగ్లండ్ దిగ్గజ కెప్టెన్ మైఖేల్ వాన్ సైతం వెల్లడించాడు.

రోహిత్ టీమ్ మారే విషయం గురించి మైఖేల్ వాన్ మాట్లాడుతూ..”రోహిత్ శర్మ వచ్చే ఐపీఎల్ సీజన్ లో కచ్చితంగా చెన్నైసూపర్ కింగ్స్ టీమ్ లో చేరుతాడు. ధోని వారసత్వాన్ని కెప్టెన్ గా కొనసాగిస్తాడు. అయితే అనివార్య కారణాల వల్ల ఇది జరగకపోతే.. వచ్చే సీజన్ కు పాండ్యాను కెప్టెన్సీ నుంచి తొలగించి, జట్టు పగ్గాలను రోహిత్ కు అందిస్తుంది ముంబై యాజమాన్యం” ప్రస్తుతం ఈ ఇంగ్లండ్ దిగ్గజం చేసిన కామెంట్స్ ఐపీఎల్ లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలపై క్లారిటీ రావాలంటే రిటెన్షన్ ప్రక్రియ ముగిసేవరకు వేచి చూడాల్సిందే. మరి నిజంగా రోహిత్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు వెళ్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి