Nidhan
Harbhajan Singh Recalls Virat Kohli Chat: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందరు ప్లేయర్లతో కలసిపోతాడు. తోటి క్రికెటర్లతో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తాడు. అలాంటోడు ఓసారి వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌తో తిట్లు తిన్నాడట.
Harbhajan Singh Recalls Virat Kohli Chat: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందరు ప్లేయర్లతో కలసిపోతాడు. తోటి క్రికెటర్లతో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తాడు. అలాంటోడు ఓసారి వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌తో తిట్లు తిన్నాడట.
Nidhan
విరాట్ కోహ్లీ.. టీమిండియా మూలస్తంభంగా కొనసాగుతున్న ప్లేయర్. వరల్డ్ టాప్ బ్యాటర్‌గా ప్రశంసలు అందుకుంటున్న ఆటగాడు. మోడర్న్ క్రికెట్ గ్రేట్‌గా లెజెండ్స్ మెచ్చుకుంటున్న బ్యాటర్. కానీ ఈ రేంజ్‌కు చేరుకునేందుకు కోహ్లీ ఎంతో శ్రమించాడు. మిడిల్ క్లాస్ బ్యాగ్రౌండ్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి తన ప్రతిభను నమ్ముకొని ఈ స్థాయికి చేరుకున్నాడు. బ్యాటింగ్, ఫిట్నెస్ను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటూ ఎవరికీ అందని రేంజ్‌కు రీచ్ అయ్యాడు. అయితే మిగతా క్రికెటర్లలాగే కోహ్లీ కూడా ఓ దశలో తనను తాను తక్కువ అంచనా వేసుకున్నాడట. తన వల్ల ఏదీ కాదని ఆత్మన్యూనతకు లోనయ్యాడట. ఈ విషయాన్ని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రివీల్ చేశాడు. ఆ టైమ్‌లో కోహ్లీని మోటివేట్ చేసేందుకు కావాలనే తిట్టానని అన్నాడు. ఇంకా భజ్జీ ఏమన్నాడంటే..
‘కోహ్లీ కెరీర్ బిగినింగ్‌లో టెస్టుల్లో ఇబ్బంది పడ్డాడు. వెస్టిండీస్ టూర్లో ఫిడెల్ ఎవర్డ్స్ను అతడు ఎదుర్కోలేకపోయాడు. ఎడ్వర్డ్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ లేదా షార్ట్ బాల్‌కు క్యాచ్‌లు ఇస్తూ ఔట్ అవ్వసాగాడు విరాట్. దీంతో అతడు నిరాశలో కూరుకుపోయాడు. టెస్టులకు పనికిరానేమోనని అతడు భావించాడు. దీంతో అతడ్ని చెడామడా తిట్టా. టెస్టు క్రికెట్లో నువ్వు 10 వేల పరుగులు చేయకపోతే సిగ్గుపడాలని చెప్పా. నీకా సత్తా ఉందంటూ అతడిలో స్ఫూర్తి నింపా. ఒకవేళ నువ్వు ఆ స్థాయికి చేరుకోకపోతే అది కచ్చితంగా నీ తప్పేనని అన్నా’ అని హర్భజన్ చెప్పుకొచ్చాడు. తన మాటలు విరాట్‌పై ప్రభావం చూపించాయని.. ఆ తర్వాత కాలంలో అతడు తనను తాను పూర్తిగా మార్చుకొని ఈ స్థాయికి చేరుకున్నాడని మెచ్చుకున్నాడు. ఎవరికీ సాధ్యం కాని ఎన్నో అరుదైన ఘనతల్ని అందుకున్నాడని ప్రశంసించాడు.
కోహ్లీ అప్పటిలా లేడని.. పూర్తిగా మారిపోయాడని భజ్జీ పేర్కొన్నాడు. డైట్ దగ్గర నుంచి మైండ్‌సెట్ వరకు అన్నీ మార్చేశాడని తెలిపాడు. ఆర్డినరీ ప్లేయర్‌గా మిగిలిపోకూడదు, తనను అందరూ ఎప్పటికీ గుర్తుంచుకోవాలనే కసితో అతడు ఛేంజ్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. టీమిండియాకు ఎన్నో విజయాలు అందివ్వాలనే ఆకలితో కింగ్ ఆడుతూ వస్తున్నాడని.. ఆ ఆకలి, కసే అతడి స్త్రెంగ్త్ అని తెలిపాడు హర్భజన్. గెలిచినా, ఓడినా పోరాటం ఆపకూడదనేది కోహ్లీ పాటించే సూత్రమని వ్యాఖ్యానించాడు. భారత క్రికెట్ మీద ఎప్పటికీ చెరిగిపోని ముద్రను విరాట్ వేశాడని.. రాబోయే తరాలు దీని నుంచి ఇన్స్పైర్ అవుతాయని హర్భజన్ వ్యాఖ్యానించాడు. పట్టుదల, క్రమశిక్షణ, నేర్చుకోవాలనే తత్వం, నెవర్ గివప్ యాటిట్యూడ్ ఉంటే విరాట్ స్థాయికి ఇతరులు కూడా చేరుకోవచ్చని.. దీన్ని కొన్ని ఏళ్ల పాటు కంటిన్యూ చేయాల్సి ఉంటుందన్నాడు.
Harbhajan Singh said – “Virat Kohli’s mindset is amazing. When he was new in the Team he said ‘I don’t want to be just an ordinary player, I want to be someone who people will remember for a long time, I want to be that guy winning games & scoring hundreds for India”. pic.twitter.com/P1pwXaBpUa
— Tanuj Singh (@ImTanujSingh) September 3, 2024