SNP
Sandeep Warrier, IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు షమీ దూరం కావడంతో గుజరాత్ టైటాన్స్ సూపర్ బౌలర్‌ను టీమ్‌లోకి తీసుకుంది. అతనెవరో ఇప్పుడు చూద్దాం..
Sandeep Warrier, IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు షమీ దూరం కావడంతో గుజరాత్ టైటాన్స్ సూపర్ బౌలర్‌ను టీమ్‌లోకి తీసుకుంది. అతనెవరో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024 కోసం అన్ని టీమ్స్ రెడీ అయిపోయాయి. శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే, ఆర్సీబీ జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు టీమ్స్ కూడా స్టార్ టీమ్స్ కావడంతో తొలి మ్యాచే టోర్నీకి హైలెట్‌గా మారనుంది. పైగా ఈ మెగా టోర్నికి సూపర్ స్టార్ట్ కూడా దక్కినట్లు అవుతుంది. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ సారి కప్పు కొట్టాలని అన్ని టీమ్స్ బలంగా ఫిక్స్ అయి రంగంలోకి దూకుతున్నాయి. వాటిలో గుజరాత్ టైటాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొహమ్మద్ షమీ లాంటి స్టార్ బౌలర్ గాయంతో జట్టు దూరమైతే అతని స్థానంలో మరో సూపర్ బౌలర్‌ను టీమ్‌లోకి తీసుకుంది. మరి ఆ బౌలర్ ఎవరు? షమీని రీప్లేస్ చేయగలడా? అనేది ఇప్పుడు చూద్దాం..
గుజరాత్ టైటాన్స్‌లోకి వచ్చిన ఆ కొత్త బౌలర్ పేరు సందీప్ వారియర్. ఇతన్ని టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీకి వారుసుడిగా చెబుతుంటారు. ఎందుకంటే.. ఇద్దరి బౌలింగ్ శైలి ఒకేలా ఉంటుంది. బాలాజీ టీమిండియాలోకి వచ్చిన కొత్తలో పాకిస్థాన్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో వికెట్ల గాల్లో ఎగిరెగిరి పడ్డాయి. ఆ మ్యాచ్‌తోనే బాలాజీ సూపర్ ఫేమస్ అయ్యాడు. ఇప్పటికీ అతని పేరు చెబితే చాలా మంది ఆ మ్యాచ్‌ను గుర్తుచేసుకుంటారు. అయితే.. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌లోకి వచ్చిన ఈ సందీప్ వారియర్ తమిళనాడుకు చెందిన బౌలర్. బౌలింగ్ స్టైల్‌లోనే కాదు.. వికెట్లు తీయడంలో కూడా ఇతను బాలాజీ వారసుడే. 2019 నుంచి ఐపీఎల్‌లో ఉన్నా.. సందీప్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు.
కానీ, ఈ సారి ఐపీఎల్‌లో సందీప్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఛాన్స్ దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచి అందరికి షాకిచ్చింది. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో, ఆశిష్ నెహ్రా కోచింగ్‌లో గుజరాత్ ఆడిన తొలి సీజన్‌లోనే సత్తా చాటింది. గత సీజన్ 2023లో రన్నరప్‌గా నిలిచింది. కానీ, ఈ సీజన్‌కు పాండ్యా లేకుండానే ఆ జట్టు బరిలోకి దిగుతుంది. యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ గుజరాత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే.. పాండ్యా, షమీ లేని టీమ్‌ను గిల్ ఎలా నడిపిస్తాడో? షమీకి రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన సందీప్ వారియర్ ఎలా రాణిస్తాడో చూడాలి. మరి సందీప్‌ను షమీ రీప్లేస్‌గా తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 UPDATE 🚨@gujarat_titans name Sandeep Warrier as replacement for Mohd. Shami; @mipaltan add Kwena Maphaka to squad for the injured Dilshan Madushanka.
Details 🔽 #TATAIPLhttps://t.co/hz4mEzdVNb
— IndianPremierLeague (@IPL) March 20, 2024