iDreamPost
android-app
ios-app

ఆఫ్ఘనిస్థాన్‌ను నమ్ముకుని నట్టేటమునుగుతున్న గుజరాత్‌! మాస్టర్‌ మైండ్‌ నెహ్రాకు అర్థం కాట్లేదా?

  • Published Apr 25, 2024 | 9:14 AM Updated Updated Apr 25, 2024 | 9:14 AM

Gujarat Titans, Afghanistan, Rashid Khan: తొలి రెండు సీజన్స్‌లో అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌.. ఈ సీజన్‌లో మాత్రం విజయాల కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అయినా కూడా విజయం దక్కడం కష్టంగా మారింది. మరి వారి పరాజయాలకు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Gujarat Titans, Afghanistan, Rashid Khan: తొలి రెండు సీజన్స్‌లో అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌.. ఈ సీజన్‌లో మాత్రం విజయాల కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అయినా కూడా విజయం దక్కడం కష్టంగా మారింది. మరి వారి పరాజయాలకు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 25, 2024 | 9:14 AMUpdated Apr 25, 2024 | 9:14 AM
ఆఫ్ఘనిస్థాన్‌ను నమ్ముకుని నట్టేటమునుగుతున్న గుజరాత్‌! మాస్టర్‌ మైండ్‌ నెహ్రాకు అర్థం కాట్లేదా?

ఐపీఎల్‌ 2024లో గుజరాత్‌ టైటాన్స్‌ ఆట ఆశించిన స్థాయిలో లేదు. 2022 సీజన్‌తో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌.. తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచి అదరగొట్టింది. అలాగే ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ఫైనల్‌కు చేరుకుని.. రన్నరప్‌గా నిలిచింది. కానీ, ఈ సీజన్‌లో మాత్రం గుజరాత్‌ పెద్దగా అంచనాలను అందుకోలేకపోతుంది. ఓ సాధారణ టీమ్‌లా ఆడుతూ.. ప్లే ఆఫ్స్‌ అవకాశాలను క్లిష్టం చేసుకుంటుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌.. 4 విజయాలు, 5 ఓటములతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. తొలి రెండు సీజన్స్‌లో అదరిపోయే ప్రదర్శనలతో టాప్‌ టీమ్‌గా చెలామణి అయిన గుజరాత్‌.. ఈ సీజన్‌లో ఎందుకు ఇలా ఆడుతుందనే అనుమానాలు క్రికెట్‌ అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి.

గత రెండు సీజన్స్‌లో కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్‌ పాండ్యా.. గుజరాత్‌ను వీడి ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు. అతను లేకపోవడంతోనే జట్టు పరిస్థితి ఇలా దిగజారిపోయిందా అంటే.. ఎవరూ ఒప్పుకోరు. ఎందుకంటే పాండ్యా కూడా ప్రస్తుతం చెత్త ఫామ్‌లో కొనసాగుతున్నాడు. అతను ఉన్నా.. లేకపోయినా.. గుజరాత్‌ టైటాన్స్‌పై పెద్దగా ప్రభావం పడేలా కనిపించడం లేదు. కొత్త కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీ బాగానే చేస్తున్నాడు. దాంతో పాటు బ్యాటర్‌గా కూడా రాణిస్తున్నాడు. కోచ్‌ ఆశిష్‌ నెహ్రా కూడా ఆ జట్టుకు అండగా ఉన్నాడు. అయినా కూడా ఎందుకు మరి ఈ ఓటములు అని చాలా మంది క్వశ్చన్‌ చేయవచ్చు. గుజరాత్‌ టైటాన్స్‌ ఎక్కువగా ఆఫ్ఘనిస్థాన్‌ ప్లేయర్లపైనే ఆధారపడుతుండటం.. ఆ జట్టుకు పెద్ద మైనస్‌గా మారిందని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు.

బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌నే తీసుకుంటే.. ఆ మ్యాచ్‌లో గుజరాత్‌ ముగ్గరు ఆఫ్ఘాన్‌ ప్లేయర్లతో బరిలోకి దిగింది. ఆడిన 9 మ్యాచ్‌ల్లోనూ ఈ కాంబినేషన్‌తోనే చాలా మ్యాచ్‌లు ఆడింది. స్టార్‌ ప్లేయర్‌ రషీద్‌ ఖాన్‌, ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్జాయ్‌, మిస్టరీ స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ గుజరాత్‌ ప్లేయింగ్‌లో ఆడుతున్నారు. ప్రతి టీమ్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌లో నలుగురు మాత్రమే ఫారెన్‌ ప్లేయర్లు ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. నలుగురు ప్లేయర్లలో ముగ్గురు ఆఫ్ఘనిస్థానీలే ఉండటం విశేషం. ఇదే ఇప్పుడు గుజరాత్‌ను ఇబ్బంది పెడుతుంది. రషీద్‌ ఖాన్‌ తన స్థాయి తగ్గట్లు ప్రదర్శన చేయడం లేదు. ఢిల్లీపై 4 ఓవర్లలో 35 రన్స్‌ ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. రషీద్‌ వైఫల్యం గుజరాత్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.

అలాగే అజ్మతుల్లా 4 ఓవర్లలో 33 రన్స్‌ ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. నూర్‌ అహ్మద్‌ ఒక వికెట్‌ తీసినా.. 3 ఓవర్లలోనే 36 రన్స్‌ ఇచ్చి ఎక్స్‌పెన్సీవ్‌గా ప్రూవ్‌ అయ్యాడు. బ్యాటింగ్‌లోనూ అజ్మతుల్లా విఫలం అయ్యాడు. కేవలం ఒక్క రన్‌ మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. ఇలా ఆఫ్ఘాన్‌ ప్లేయర్లు.. గుజరాత్‌ టీమ్‌కు భారంగా మారుతున్నారు. మరి ఈ విషయంపై ఆ జట్టు హెడ్‌కోచ్‌, మాస్టర్‌ మైండ్‌ ఆశిష్‌ నెహ్రా ఎందుకు ఆలోచించడం లేదని క్రికెట్‌ అభిమానులు సైతం షాక్‌కు గురవుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.