iDreamPost
android-app
ios-app

ఆర్ధిక కష్టాల్లో దిగ్గజ క్రికెటర్‌! తనను ఆదుకోవాలంటూ..

  • Published Oct 27, 2023 | 4:05 PM Updated Updated Oct 27, 2023 | 4:41 PM

క్రికెటర్‌గా దాదాపు 14 ఏళ్ల కెరీర్‌, ఆ పై ఓ పెద్ద జట్టుకు కోచ్‌గా రెండేళ్లు పనిచేసిన తర్వాత కూడా ఓ దిగ్గజ మాజీ క్రికెటర్‌ ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నాడు. మరి ఆ మాజీ క్రికెటర్‌ ఎవరు? ఆయనకు ఎందుకు అ

క్రికెటర్‌గా దాదాపు 14 ఏళ్ల కెరీర్‌, ఆ పై ఓ పెద్ద జట్టుకు కోచ్‌గా రెండేళ్లు పనిచేసిన తర్వాత కూడా ఓ దిగ్గజ మాజీ క్రికెటర్‌ ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నాడు. మరి ఆ మాజీ క్రికెటర్‌ ఎవరు? ఆయనకు ఎందుకు అ

  • Published Oct 27, 2023 | 4:05 PMUpdated Oct 27, 2023 | 4:41 PM
ఆర్ధిక కష్టాల్లో దిగ్గజ క్రికెటర్‌! తనను ఆదుకోవాలంటూ..

దిగ్గజ క్రికెటర్‌గా ఎన్నో ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడి, టీమిండియా కోచ్‌గా పనిచేసిన ఓ మాజీ క్రికెటర్‌ ప్రస్తుతం ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ పరిస్థితి నుంచి బయపడేందుకు ఆయన.. తనకు విరాళాలు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాడు. ఇలాంటి గడ్డు కాలం ఎదుర్కొంటోంది మరెవరో కాదు.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌, టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌. 75 ఏళ్ల ఛాపెల్‌ 2005 నుంచి 2007 మధ్య కాలంలో ఇండియాకు కోచ్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన అప్పటి టీమిండియా కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీతో గొడవతో పాటు పలు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నారు.

అయితే.. ప్రస్తుతం ఛాపెల్‌ ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారు. దీంతో ఆయన స్నేహితులు.. ఛాపెల్‌ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు విరాళాలు సేకరించాలని నిర్ణయించకున్నారు. ‘గో ఫండ్‌ మీ’ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. అయితే.. విరాళాల సేకరణకు ఛాపెల్‌ అయిష్టంగానే ఉన్నట్లు సమాచారం. తాను మరీ అంత దీన స్థితిలో లేనని, అలా అని లగ్జరీ లైఫ్‌ గడపడటం లేదని, ఏదో సాధారణ జీవితం గడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ తరం క్రికెటర్లు ఉన్నంత లగ్జరీగా తాను లేను, అలాగే తన తోటి క్రికెటర్లు రిటైర్మెంట్‌ తర్వాత గడుపుతున్న మంచి లైఫ్‌ కూడా తాను లీడ్‌ చేయడం లేదని తెలిపారు. రిటైర్మెంట్‌ తర్వాత తాను ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో భాగంగానే ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని అన్నారు ఛాపెల్‌.

1970 నుంచి 1984 మధ్య కాలంలో ఛాపెల్‌ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించారు. అలాగే 1975 నుంచి 1977 మధ్య ఆసీస్‌ కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. అయితే.. 2005లో టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఛాపెల్‌.. అప్పటి స్టార్‌ క్రికెటర్లు అయినా సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌ల సహజమైన టెక్నిక్‌, ఆటతీరును మార్చేందుకు ఛాపెల్‌ ప్రయత్నించాడని, ఈ క్రమంలోనే ఆటగాళ్లతో ఛాపెల్‌కు విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అలాగే ఛాపెల్‌తో విభేదాల కారణంగా కెప్టెన్సీతో జట్టులో స్థానంలో కూడా కోల్పోయాడు దాదా. ఛాపెల్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకున్న తర్వాత.. గంగూలీ మళ్లీ టీమ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి.. 2008లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఛాపెల్‌తో విభేదాలు లేకుంటే.. గంగూలీ మరికొంత కాలం టీమిండియా కెప్టెన్‌గా ఉండేవాడని కూడా కొంతమంది క్రికెట్‌ అభిమానులు విశ్వసిస్తారు. మరి ఛాపెల్‌-గంగూలీ మధ్య గొడవను అటు ఉంచితే.. ప్రస్తుతం ఛాపెల్‌ ఆర్థిక కష్టాల్లో ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.