iDreamPost
android-app
ios-app

మూడు IPL టీమ్స్‌కు గుడ్‌న్యూస్‌! స్టార్‌ క్రికెటర్లకు లైన్‌ క్లియర్‌?

  • Published Jan 09, 2024 | 1:33 PM Updated Updated Jan 09, 2024 | 1:33 PM

ఐపీఎల్‌లో ఆడేందుకు కోటి ఆశలు పెట్టుకున్న ఆటగాళ్లకు లైన్‌ క్లియర్‌ అయింది. వారితో పాటు ఐపీఎల్‌లోని ఓ మూడు ఫ్రాంచైజ్‌లకు ఇది నిజంగా గుడ్‌న్యూస్‌. ఇంతకీ ఎవరిపై నిషేధం ఎత్తివేశారో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌లో ఆడేందుకు కోటి ఆశలు పెట్టుకున్న ఆటగాళ్లకు లైన్‌ క్లియర్‌ అయింది. వారితో పాటు ఐపీఎల్‌లోని ఓ మూడు ఫ్రాంచైజ్‌లకు ఇది నిజంగా గుడ్‌న్యూస్‌. ఇంతకీ ఎవరిపై నిషేధం ఎత్తివేశారో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 09, 2024 | 1:33 PMUpdated Jan 09, 2024 | 1:33 PM
మూడు IPL టీమ్స్‌కు గుడ్‌న్యూస్‌! స్టార్‌ క్రికెటర్లకు లైన్‌ క్లియర్‌?

ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం ఇప్పటి నుంచే క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మెగా టోర్నీ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ ఫ్యాన్స్‌ వేయి కళ్లతో వెయిట్‌ చేస్తున్నారు. దాదాపు రెండు నెలల పాటు క్రికెట్‌ ప్రేమికులకు ఫుల్‌ వినోదాన్ని అందించే ఐపీఎల్‌ అంటే ఎంతో మందికి ఆసక్తి. ఇప్పటికే రాబోయే సీజన్‌ కోసం మినీ వేలం కూడా ముగిసింది. జరిగింది మినీ వేలమే అయినా.. ఐపీఎల్‌ చరిత్రలోనే కనీవిని ఎరుగని రికార్డులు బద్దలయ్యాయి. ఆసీస్‌ ఆటగాళ్లు మిచెల్‌ స్టార్క్‌, ప్యాట్‌ కమిన్స్‌లకు భారీ ధర పలికింది.

కాగా, ఐపీఎల్‌ మినీ వేలం ముగిసిన తర్వాత ఓ మూడు జట్లకు భారీ షాక్‌ తగిలింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ జట్లకు ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు షాకిచ్చేలా కనిపించింది. ఐపీఎల్‌లో ఆయా టీమ్స్‌కు ఆడుతున్న ఆఫ్ఠాన్‌ ప్లేయర్లకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఎన్‌ఓసీ(నో అబ్జేక్షన్‌ సర్టిఫికేట్‌) ఇవ్వడం లేదనే వార్తలు వచ్చాయి. అలాగే దేశం తరఫున ఆడకుండా.. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను వద్దనుకున్న ఆటగాళ్లపై ఏకంగా నిషేధం విధించేందుకు కూడా ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు సిద్ధమైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

Ban lifted on three players!

దీంతో.. ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడుతున్న ఫజల్‌ ఫారుఖీ, లక్నోకు ఆడుతున్న నవీన్‌ ఉల్‌ హక్‌, కేకేఆర్‌కు ఆడుతున్న ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌లపై ఆఫ్ఘాన్‌ బోర్డు నిషేధం విధిస్తే.. వాళ్లు ఐపీఎల్‌ 2024కు దూరం అవుతారనే ప్రచారం జరిగింది. ఈ వార్తలు వచ్చిన వెంటనే ఆయా ఐపీఎల్‌ ఫ్రాంచైజ్‌లు వారి స్థానంలో కొత్త ఆటగాళ్లను తీసుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాయి. కానీ, ఆ ఫ్రాంచైజ్‌లకు పెద్ద తలనొప్పి లేకుండా.. ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఆ ముగ్గురు ఆటగాళ్లకు ఎన్‌ఓసీ ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. దీంతో.. ఎస్‌ఆర్‌హెచ్‌, లక్నో, కేకేఆర్‌లకు ఇది గుడ్‌న్యూస్‌ అనే చెప్పాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.