iDreamPost

ఇండియా-కివీస్ మ్యాచ్.. ఫిలిప్స్ క్రీజులోకి రాకున్నా రనౌట్ ఇవ్వని అంపైర్! కారణం?

  • Author Soma Sekhar Published - 09:06 AM, Thu - 16 November 23

ఇండియా-కివీస్ మ్యాచ్ లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్ క్రీజ్ లోకి రాకముందే బూమ్రా వికెట్లను కొట్టినా.. అంపైర్ మాత్రం రనౌట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే విషయం క్రికెట్ ఫ్యాన్స్ లో అయోమయంలోకి నెట్టేసింది.

ఇండియా-కివీస్ మ్యాచ్ లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్ క్రీజ్ లోకి రాకముందే బూమ్రా వికెట్లను కొట్టినా.. అంపైర్ మాత్రం రనౌట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే విషయం క్రికెట్ ఫ్యాన్స్ లో అయోమయంలోకి నెట్టేసింది.

  • Author Soma Sekhar Published - 09:06 AM, Thu - 16 November 23
ఇండియా-కివీస్ మ్యాచ్.. ఫిలిప్స్ క్రీజులోకి రాకున్నా రనౌట్ ఇవ్వని అంపైర్! కారణం?

వరల్డ్ కప్ లో భాగంగా వాంఖడే వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా అద్భుత విజయం సాధించి.. విశ్వసమరం ఫైనల్లోకి అడుగుపెట్టింది. మహ్మద్ షమీ అద్భుత బౌలింగ్ తో 70 రన్స్ తేడాతో కివీస్ ను చిత్తుచేసింది భారత జట్టు. భారీ స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఉత్కంఠగా సాగిన ఈ గేమ్ లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్ క్రీజ్ లోకి రాకముందే బూమ్రా వికెట్లను కొట్టినా.. అంపైర్ మాత్రం రనౌట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే విషయం క్రికెట్ ఫ్యాన్స్ లో అయోమయంలోకి నెట్టేసింది. మరి అంపైర్ ఔట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ప్రేక్షకులకు ఫుల్ మజాను పంచింది. బ్యాటర్లు తమ బ్యాటు కు పనిచెబితే.. బౌలర్లు తమ పేస్ తో బెంబేలెత్తించారు. దీంతో అభిమానులకు అసలైన కిక్కు అందింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా 70 పరుగులతో విజయం సాధించి.. టైటిల్ ను అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. అదేంటంటే?

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 43వ ఓవర్ వేయడానికి వచ్చాడు బూమ్రా. ఈ ఓవర్ తొలి బంతికి డార్లీ మిచెల్ రెండు పరుగులు తీశాడు. మెుదటి పరుగును పూర్తి చేసిన క్రమంలో బంతిని ఆపిన జడేజా.. మిచెల్ ను అవుట్ చేయాలనే ఉద్దేశంతో నాన్ స్ట్రైకర్ వైపు ఉన్న వికెట్లకు త్రో చేయగా.. డైరెక్ట్ గా త్రో వికెట్లను గిరాటేసింది. అయితే అప్పటికే తొలి రన్ పూర్తి చేసుకున్న అతడు రెండో రన్ కోసం ప్రయత్నించాడు. ఈ టైమ్ లో బాల్ అందుకున్న బుమ్రా బౌలర్ వైపు ఉన్న వికెట్లను త్రో చేశాడు. కానీ అప్పటికి గ్లెన్ ఫిలిప్స్ ఇంకా క్రీజ్ లోకి చేరుకోలేదు. దీంతో అందరు అతడు ఔట్ అని అనుకున్నారు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ గా ప్రకటించాడు.

దానికి కారణం ఏంటంటే? MCC రూల్స్ ప్రకారం వికెట్ల మీదున్న బెయిల్స్ కిందపడిన టైమ్ లో ఫీల్డర్ ఆ బ్యాటర్ ను రనౌట్ చేయాలి అనుకుంటే.. బాల్ ను చేత్తో పట్టుకుని వికెట్లను లాగేయాలి. అప్పుడే అది ఔట్ గా పరిగణిస్తారు అంపైర్లు. ఈ మ్యాచ్ బుమ్రా అలా చేయలేదు. దీంతో అంపైర్ ఫిలిప్స్ ను నాటౌట్ గా ప్రకటించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 398 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 48.5 ఓవర్లలో 327 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్లలో షమీ 7 వికెట్లు తీసి కివీస్ నడ్డివిరిచాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి